KGF 2 ఎఫెక్ట్: యష్ వెంట పడుతున్న టాలీవుడ్ నిర్మాతలు!
KGF చాప్టర్ 1 తో యష్ ఒక్కసారిగా నేషనల్ వైడ్ లో క్రేజ్ అందుకున్న విషయం తెలిసిందే. కన్నడ ఇండస్ట్రీలోనే అగ్ర హీరోగా కొనసాగుతున్న యష్ ఇటు తెలుగులో కూడా తన మార్కెట్ ను మరింత పెంచుకోవాడనికి సిద్ధమవుతున్నాడు. KGF చాప్టర్ 2తో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అతను సరికొత్త రికార్డులను బ్రేక్ చేయగలడని తెలుస్తోంది.
ఎందుకంటే సినిమాకున్న డిమాండ్ మామూలుగా లేదు. KGF 2 ప్రీ రిలీజ్ బిజినెస్ బడా సినిమాలను తలపించేలా ఉంది. అప్పట్లో 2.ఓ సినిమా కంటే ఎక్కువ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేయవచ్చని సమాచారం. ఇక ఆ సినిమా విడుదల కాకముందే టాలీవుడ్ దర్శక నిర్మాతలు యష్ డేట్స్ తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే మైత్రి మూవీ మేకర్స్ యష్ పై కర్చీఫ్ వేయడానికి రెడీగా ఉండగా RRR నిర్మాత దానయ్య కూడా రెడీ అవుతున్నట్లు టాక్.

కేవలం నిర్మాతలే కాకుండా మన అగ్ర దర్శకులు యష్ తో సినిమా చేయాలని చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందులో పూరి జగన్నాథ్ కూడా ఉన్నట్లు గత కొన్ని రోజుల క్రితం టాక్ గట్టిగానే వచ్చింది. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ లైగర్ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే లాక్ డౌన్ లోనే యష్ కోసం ఒక కథ రెడీ చేశాడని సమాచారం. మరి యష్ KGF 2 అనంతరం ఎలాంటి సినిమాతో వస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications











