మహేష్ 'ఖలేజా' షూటింగ్ ఎంతవరకూ వచ్చిందంటే...

By Srikanya

మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఖలేజా చిత్రం ఫైనల్ షెడ్యూల్ హైదరాబాద్ లోని ఇక్రిసాట్ లో జరగనుంది. ఈ షెడ్యుల్ తో టాకీ పార్ట్ పూర్తవుతుంది.అలాగే ఈ షెడ్యూల్ మొదలయ్యే లోగా డబ్బింగ్ పార్ట్ పూర్తవుతుంది. ఇక ఈ షెడ్యూల్ తర్వాత రెండు పాటల చిత్రీకరణ మిగిలి ఉంటుంది. ఓ పాట అన్నపూర్ణలో వేసిన సెట్ లో తీస్తారు. ఆ తర్వాత రామోజీ ఫిల్మ్ సిటీలోని కొన్ని ఎంపిక చేసిన లొకేషన్స్ లో మరో పాట చిత్రీకరిస్తారు. ఈ పాటలు పని అయ్యాక పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ప్రారంభిస్తారు. ఖలేజా ఆడియో ఆగస్టు రెండో వారంలో ప్లాన్ చేసే అవకాశం ఉంది. అలాగే చిత్రాన్ని సెప్టెంబర్ 23న రిలీజ్ చేయాలని అనుకుంటున్నట్లు సమాచారం. త్రివిక్రమ్ డైరక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. శింగనమల రమేష్ నిర్మిస్తున్నాడు. అనుష్క ఈ చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది.

ప్రస్తుతం సీనియర్ నిర్మాత సి.కళ్యాణ్ ఈ చిత్రం పూర్తి భాధ్యతను తీసుకుని దగ్గరుండి చూస్తున్నారు. నిర్మాత శింగనమల రమేష్ బడ్జెట్ అనుకున్న పరిధి దాటిపోవటం, సినిమా రీ షూటింగ్ జరగటం వంటివి గమనించి ఈ నిర్ణయానికి వచ్చి కళ్యాణ్ కి అప్పచెప్పారు. అలాగే సగం వరకూ పనిచేసిన కెమెరా మెన్ సునీల్ పటేల్ ని మార్చి యాష్ భట్ ని తీసుకున్నట్లు తెలుస్తోంది. యాష్ భట్ ఇంతకు ముందు రామ్ చరణ్ తేజ , ధోణిలతో కూల్ డ్రింక్ యాడ్ చేసారు. అతిధి తర్వాత చాలా గ్యాప్ తో మహేష్ బాబు ఈ చిత్రాన్ని చేస్తున్నారు. అలాగే ఈ చిత్రం అనంతరం శ్రీను వైట్ల దర్శకత్వంలో మహేష్ బాబు చిత్రం ఉంటుంది. సమంతా ఈ చిత్రంలో హీరోయిన్ గా ఉంటోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X