సంచలన విజయం సాధించిన బాలీవుడ్ జిరాక్సే ‘ఖలేజా’
స్టార్ రైటర్ అండ్ డైరెక్టర్ త్రివిక్రమ్ రూపొందిస్తోన్న తాజా చిత్రం మహేష్ 'ఖలేజా" ప్రేక్షకాభిమానులకు దసరా కానుకగా అక్టోబర్ లో విడుదల కానుంది కాగా ఈ చిత్రం కోసం బ్యాలెన్స్ వున్న'మకతిక మశ్చీంద్రా" అంటూ సాగే చివరి పాటను పలు భారీ సెట్స్ వేసి సెప్టెంబర్ 5 నుంచి 8 వరకూ మహేష్-అనుష్క లపై ప్రేమ్ రక్షిత్ డ్యాన్స్ డైరెక్షన్ లో చిత్రీకరించనున్నారు. ఇక అసలు విషయానికి వస్తే ఇప్పటివరకూ గోప్యంగా వున్న ఈ చిత్రం కథాంశం గురించి ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో వేడివేడిగా చర్చలు మొదలవుతున్నాయి.
దాదాపు 40 ఏళ్ళ క్రితం విడుదలై సంచలన విజయం సాధించిన ఓ బాలీవుడ్ క్లాసిక్ కి 'ఖలేజా" జిరాక్స్ కాఫీ అనే విషయం విశ్వసనీయంగా తెలుస్తోంది. హీరో, హీరోయిన్ల క్యారెక్టరైజేషన్స్ ని తన శైలిలోకి మార్చి మిగిలిన కథాంశాన్ని మాత్రం సేమ్ స్కేల్ లో ఫామ్ చేసేశారట త్రివిక్రమ్. మరింతకీ ఆ బాలీవుడ్ క్లాసిక్ ఏంటీ అంటారా..ఆ టైటిల్ ఇప్పుడే చెప్పెయ్యడం ఎందుకులెండి ఈ వార్త పూర్తిగా నిజమేనని నిర్థారణ అయితే అప్పుడా గుట్టునీ బయట పట్టేయ్యొచ్చు.


Click it and Unblock the Notifications











