చిన్న అతిలోక సుందరితో మోక్షజ్ఞ.. సరైన పిల్లనే పట్టాడుగా!
నందమూరి తారక రామారావు తర్వాత ఆ ఫ్యామిలీలో స్టార్ అయిన హీరో నందమూరి బాలకృష్ణ. దాదాపు నలభై ఏళ్లుగా సినీ రంగంలో తనదైన మార్కును చూపిస్తూ దూసుకుపోతోన్న ఆయన.. వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ దూసుకుపోతోన్నారు. ఈ ఉత్సాహంలోనే మరిన్ని ప్రాజెక్టులను లైన్‌లో పెడుతున్నారు. అదే సమయంలో ఆయన తన కుమారుడు మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేయబోతున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కబోతోంది. ఈ నేపథ్యంలో మోక్షజ్ఞతో రొమాన్స్ చేయబోతున్న హీరోయిన్ పేరు తాజాగా లీకైంది. ఆ వివరాలను మీరే చూడండి!
బాలకృష్ణ గుడ్ న్యూస్
సీనియర్ ఎన్టీఆర్ తర్వాత ఆ ఫ్యామిలీ నుంచి ఎంతో మంది హీరోలుగా సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. వారిలో పలువురు మాత్రమే స్టార్లుగా సత్తా చాటుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తన కుమారుడు మోక్షజ్ఞ కూడా హీరోగా రాబోతున్నాడని బాలయ్య కొన్నేళ్ల క్రితమే అధికారికంగా ప్రకటించారు. దీంతో అతడి రాక కోసం ఫ్యాన్స్ అందరూ ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.

ఫిజిక్ మొత్తం మార్చి
నందమూరి మోక్షజ్ఞకు సంబంధించిన ఫొటోలు కొన్నేళ్ల క్రితమే సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అందులో అతడు చాలా లావుగా ఉండడంతో ఫ్యాన్స్ బాగా నిరాశ చెందారు. కానీ, ఇప్పుడు మాత్రం వాడి లుక్స్ ఒక్కసారిగా మారిపోయాయి. ముఖ్యంగా అతడు బాగా సన్నబడడంతో పాటు హ్యాండ్సమ్‌గా కనిపిస్తున్నాడు. దీంతో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
వాటిలో రాటుదేలేలా
నందమూరి మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం గురించి నందమూరి బాలకృష్ణ పట్టుదలతో ఉన్నారు. అందుకే పదే పదే అతడి ఎంట్రీ గురించి ప్రచారాలు జరుగుతున్నాయి. ఇదంతా తెర ముందు జరిగితే.. తెర వెనుక మాత్రం మోక్షజ్ఞ నటనలో, డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్ డెలివరీలలో శిక్షణ తీసుకుంటున్నాడు. ఇవన్నీ పూర్తైన వెంటనే అతడు సినీ రంగ ప్రవేశం చేస్తాడని తెలుస్తోంది.

ప్రశాంత్ వర్మతోనే
మోక్షజ్ఞను హీరోగా తీసుకు వచ్చే బాధ్యతను బాలయ్య.. రాజమౌళి చేతిలో పెట్టాడని మొదట ప్రచారం జరిగింది. ఆ తర్వాత పూరీ జగన్నాథ్, గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి, వీవీ వినాయక్, క్రిష్ సహా ఎంతో మంది డైరెక్టర్ల పేర్లు తెరపైకి వచ్చాయి. ఈ క్రమంలోనే ప్రశాంత్ వర్మను ఇటీవలే ఫైనల్ చేశారని తెలిసింది. దీనిపై త్వరలోనే ప్రకటన రాబోతుందని సమాచారం.

అతిలోక సుందరితో
ప్రశాంత్ వర్మతో నందమూరి మోక్షజ్ఞ చేయబోయే సినిమాపై ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతోన్నాయి. ఈ నేపథ్యంలోనే హీరోయిన్ గురించి కూడా టాక్స్ నడుస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో మోక్షజ్ఞకు జోడీగా శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్ నటిస్తుందట. ఇప్పటికే బోనీ కపూర్‌తో ప్రశాంత్ వర్మ సంప్రదింపులు జరిపాడని తాజాగా న్యూస్ తెలిసింది.


Click it and Unblock the Notifications











