అప్పుడు జాన్వీ.. ఇప్పుడు చెల్లెలు అతడితో డేటింగ్..? ప్రియుడి పేరుతో అక్కడ..!
హిందీ సినిమా నుంచి తెలుగులో వచ్చి అదరగొట్టిన రీసెంట్ హాట్ బ్యూటీ ఎవరైనా ఉన్నారు అంటే అది దేవర బ్యూటీ జాన్వీ కపూర్ అనే చెప్పవచ్చు. కాగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా తెలుగులో అరంగ్రేట్రం చేసిన మొదటి సినిమాకే తన హాట్ షోతో సంచలనం సెట్ చేసింది. కానీ ఇపుడు ఫైనల్ గా మాత్రం టాలీవుడ్ లో ఈ అమ్మడు సెటిల్ అయ్యిపోయింది.
మరి తాను రావడమే పెద్ద బ్యాక్గ్రౌండ్ తోనే ఆమె వచ్చింది కానీ హిందీలో మాత్రం ముందు నుంచి బాగా యాక్టీవ్ గా ఉండేది. కాగా అక్కడ సినిమాలు తన లవ్ అఫైర్స్, డేటింగ్ లు ఇలా చాలానే ఆమె విషయంలో నడిచాయి. కాగా ఇపుడు ఇదే బాటలో జాన్వీ కపూర్ చెల్లెలు ఖుషి కపూర్ కూడా వెళుతునట్టుగా తెలుస్తుంది. జాన్వీ కపూర్ కి బాయ్ ఫ్రెండ్ గా శిఖర్ అనే వ్యక్తి ఉండేవాడు.

మరి తన పేరుతో కూడిన నెక్లెస్ ని జాన్వీ కపూర్ ఆ మధ్య ధరించి అందరికీ షాకిచ్చింది. ఇలా బాలీవుడ్ వర్గాల్లో మంచి ట్రెండింగ్ గా నిలిచిన జాన్వీ కపూర్ నే ఇపుడు తన చెల్లెలు ఆదర్శంగా తీసుకోవడం అనేది ఇపుడు మళ్ళీ చర్చకి దారి తీసింది. కాగా జాన్వీ కపూర్ చెల్లెలు ఖుషి కపూర్ ఈ మధ్యనే సినిమాల్లోకి వచ్చి హైలైట్ అవుతుంది. కాగా ఇపుడు ఖుషి కపూర్ నుంచి కూడా జాన్వీ తరహా లోనే ఒక ఖరీదైన నెక్లెస్..
అందులోని తన ప్రియుడు పేరుతో ఆమె అందరికీ షాకిచ్చింది. రీసెంట్ గా మీడియా ముందుకు వచ్చిన ఖుషి కపూర్ తన ఫోటో షూట్ లో ధరించిన నగ అందరి దృష్టిని ఆకర్షించింది. కాగా ఆమెని సరిగా గమనిస్తే తన మెడపై ఉన్న చైన్ ని చూస్తే అందులో వి అనే పదం మధ్యలో లవ్ సింబల్ ఆ తర్వాత కే అని ఉంది.
అంటే ఇక్కడ వి పదంతో తన ప్రియుడు వేదాంగ్ రైనా అలాగే కే అంటే ఖుషి కపూర్ మధ్యలో తమ ప్రేమ చిహ్నంతో ఇద్దరు ఇపుడు ప్రేమలో ఉన్నారని తన అక్క లానే బయటకి చెప్పేసింది అంటూ ఇపుడు గట్టి చర్చలు జరుగుతున్నాయి. ఇక ఈ పిక్స్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుండగా కపూర్ కుటుంబం అభిమానులు త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పేలా ఉన్నారని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు.
మరి మెల్లగా హింట్ ఇచ్చిన ఖుషి కపూర్ త్వరలోనే తన ప్రియుడుతో రిలేషన్ ని ఓపెన్ గా చెబుతుందేమో చూడాలి. ఇక రీసెంట్ గానే ఖుషి కపూర్ నటించిన ఓ సినిమా నేరుగా ఓటిటిలో విడుదలకి వచ్చింది. ఇక జాన్వీ కపూర్ విషయానికి వస్తే ఆమె దేవర హిట్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన భారీ సినిమా 'పెద్ది'లో కూడా నటిస్తుంది. వీటితో పాటుగా మరిన్ని సినిమాలు ఆమె తెలుగులో చేయనుంది.


Click it and Unblock the Notifications











