ఆ హీరోతో పీకల్లోతు ప్రేమలో స్టార్ హీరోయిన్ చెల్లెలు .. ఆ రెండు అక్షరాలతో హింట్!

భారతీయ చిత్ర పరిశ్రమలో అతిలోక సుందరిగా, లేడీ సూపర్‌స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు శ్రీదేవి. దాదాపు నాలుగు దశాబ్ధాల పాటు వెండితెరను ఏలిన శ్రీదేవి చిన్న వయసులోనే కన్నుమూశారు. తన వారసుల సక్సెస్‌ను చూడకుండానే ఆమె తిరిగిరాని లోకాలకు తరలిపోయారు. శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ , చిన్న కుమార్తె ఖుషీ కపూర్. జాన్వీ ఎంతో శ్రమించి బాలీవుడ్‌లో తనకంటూ గుర్తింపు తెచ్చుకుని ఇప్పడు టాలీవుడ్‌లోనూ జెండా పాతాలని గట్టిగా ట్రై చేస్తున్నారు.

తను స్థిరపడటంతో చెల్లెలు ఖుషి కెరీర్‌ను కూడా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు జాన్వీ కపూర్. 2016లో భష్మ్ హో ప్యార్ కా తక్రార్, 2020లో స్పీక్ అప్ అనే షార్ట్ ఫిలింస్‌లో నటించారు ఖుషి. 2023లో జోయా అక్తర్ దర్శకత్వంలో వచ్చిన ది అర్కీస్‌ అనే సినిమాతో హిందీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు. కానీ అందులో ఆమెది చెప్పుకోగదగ్గ పాత్ర కాకపోవడంతో అంతగా గుర్తింపు రాలేదు.

Khushi Kapoor Hints Her Relationship With Vedang Raina netizens says this necklace is a evidence

ఒక్క సినిమాలో కూడా హీరోయిన్‌గా ఫుల్ లెంగ్త్‌లో కనిపించనప్పటికీ స్టార్ హీరోయిన్ స్టేటస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు ఖుషీ కపూర్. సినిమాల సంగతి ఏమో కానీ డేటింగ్స్, ఎఫైర్స్ విషయంలో మాత్రం అక్క కంటే నాలుగు ఆకులు ఎక్కువే చదివింది ఈ చిన్నది. తొలుత శిఖర్ పహారియాతో ప్రేమాయణం సాగించిన ఖుషీ ఆయనకు బ్రేకప్ చెప్పేసినట్లుగా బాలీవుడ్ టాక్. ప్రస్తుతం ఆమె మరో యువ నటుడితో పీకల్లోతు ప్రేమాయణం సాగిస్తున్నట్లుగా బీటౌన్ కోడై కూస్తోంది.

అతను ఎవరో కాదు.. వేదాంగ్‌ రైనా. వారిద్దరూ వెబ్ సిరీస్ ది ఆర్చీస్ లో కలిసి జంటగా నటించారు. ఈ సినిమా షూటింగు సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి రిలేషన్ వరకు వెళ్లిందని అందరూ చెప్పుకుంటున్నారు. వేదాంగ్ రైనా గతేడాది ఆలియా భట్‌తో కలిసి జిగ్రా మూవీలో నటించాడు. ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో ప్రభావం చూపించలేకపోయింది. అయినప్పటికీ బాలీవుడ్‌లో హీరోగా నిలదొక్కుకొనే ప్రయత్నం చేస్తున్నారు వేదాంగ్.

వేదాంగ్- ఖుషీలు గుట్టుగా తమ ప్రేమ బంధాన్ని సాగిస్తూ ఫారిన్ ట్రిప్‌లు, వేకేషన్‌లు, పార్టీలలో ఎంజాయ్ చేస్తున్నారని బాలీవుడ్ టాక్. మొన్నామధ్య వేదాంగ్ రైనా‌- ఖుషితో కలిసి మాల్దీవుల్లో దిగారు. అయితే వెకేషన్ సందర్భంగా దిగిన ఫోటోలను ఖుషి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా వీరి వ్యవహారం బయటపడింది. ఇన్నాళ్లు గుట్టుగా సాగిన వీరి బంధాన్ని బయటపెట్టాలని ఖుషీ భావిస్తున్నట్లుగా ఉంది. దీనిలో భాగంగా తమ ప్రేమ గురించి పరోక్షంగా హింట్ ఇచ్చింది.

ఖుషి ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోలను షేర్ చేశారు. వాటిలో ఆమె ఓ నెక్లెస్ ధరించగా.. దానిపై V, K అక్షరాల మధ్య హార్ట్ సింబల్ ఉంది. వీటి ప్రకారం వీ అంటే వేదాంగ్ రైనా.. కే అంటే ఖుషి కపూర్. అంటే దీని అర్ధం వేదాంగ్ లవ్స్ ఖుషి. తమ బంధాన్ని ఇలా చెప్పకనే చెప్పిన ఈ జంట త్వరలోనే అధికారికంగా తమ బంధాన్ని బయటపెడుతుందా? లేక ఇది రూమర్ మాత్రమేనా? అన్నది త్వరలోనే తేలిపోనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X