కియారా అమాంతం పెంచేసింది.. రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?.. నిర్మాత, హీరోకు షాక్:

బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీకి టాలీవుడ్ బ్రహ్మరథం పడుతున్నది. హిందీలో హాట్‌హాట్ నటిస్తూ దుమ్మురేపుతున్నది. అలాగే నెట్‌ఫ్లిక్ల్‌లో లస్ట్ స్టోరీస్‌ లాంటి బోల్డ్ కంటెంట్ ఉన్న మూవీతో సెన్సేషనల్‌గా మారింది. తాజాగా రాంచరణ్‌తో కలిసి నటించిన వినయ విధేయ రామ చిత్రంలోను కనిపించింది. ఈ చిత్రంలో పెద్దగా ప్రాధాన్యం లేని పాత్రలోనే కియారా నటించింది. అయితే అమ్ముడు పారితోషికం విషయంలో చుక్కలు చూపిస్తుందట.

టాలీవుడ్‌లో భారీగా

టాలీవుడ్‌లో భారీగా

భరత్ అనే నేను చిత్రంలో ప్రిన్స్ మహేష్ బాబుతో జతకట్టిన ఈ బ్యూటీ వెంటనే రాంచరణ్‌తో నటించే అవకాశాన్ని చేజిక్కించుకొన్నది. ఈ రెండు చిత్రాలు కూడా టాలీవుడ్‌లో బడా నిర్మాత డీవీవీ దానయ్యవే కావడం గమనార్హం. వినయ విధేయ తర్వాత కొత్తగా సినిమాలు అంగీకరించిన సమాచారం లేదు.

బాలీవుడ్‌లో కరణ్ జోహర్‌తో

బాలీవుడ్‌లో కరణ్ జోహర్‌తో

అయితే బాలీవుడ్‌లో కరణ్ జోహర్ చిత్రంలో నటించడానికి ఒకే చెప్పింది. ఇంకా కొన్నిచిత్రాలు చర్చల దశలో ఉన్నాయని కియారా పేర్కొన్నది. తెలుగులో కూడా ఇతర నిర్మాతల నుంచి పెద్దగా రెస్సాన్స్ వచ్చినట్టు వార్తలు లేవు. రెండు భారీ చిత్రాల తర్వాత తెలుగులో సెకండరీ గ్రేడ్ హీరోల రేంజ్‌కు తగినట్టు రెమ్యునరేషన్‌ను డిమాండ్ చేస్తున్నట్టు ఓ వార్త మీడియాలో వైరల్ అయింది.

గోపిచంద్ సినిమా కోసం

గోపిచంద్ సినిమా కోసం

ఇటీవల హీరో గోపిచంద్ తదుపరి చిత్రంలో కియారాను నటింపజేసేందుకు సదరు నిర్మాతలు సంప్రదింపులు జరిపారట. అయితే వారికి కియారా చెప్పిన రెమ్యునరేషన్ విని చుక్కలు కనిపించాయట. ఈ చిత్రానికి సంపత్ నంది దర్శకత్వం వహించనున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.

కోటికిపైగానే డిమాండ్

కోటికిపైగానే డిమాండ్

గోపిచంద్, సంపత్ నంది కాంబినేషన్‌లో వచ్చే సినిమా కోసం కియారా సుమారు రూ.1 కోటికిపైగానే రెమ్యునరేషన్ అడిగిందంట. దాంతో మరోమాట మాట్లాడకుండా నిర్మాతలు వచ్చేశారట. ప్రస్తుతం చేసిన డిమాండ్‌తో ధైర్యం చేయలేక కియారాను వదిలేసి మరో హీరోయిన్‌పై దృష్టిపెట్టారనేది తాజా సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X