రామ్ చరణ్ హీరోయిన్‌తో ఎన్టీఆర్ రొమాన్స్.. అందుకే ఆమెకు ఓకే చెప్పాడా!
తెలుగు చిత్ర పరిశ్రమలోని హీరోలు అందరూ పాన్ ఇండియాపై ఫోకస్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు పేరున్న స్టార్లు అందరూ భారీ చిత్రాల్లో నటిస్తూ ముందుకు సాగుతోన్నారు. అందులో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకడు. ఈ మధ్య కాలంలో వరుస హిట్లతో ఫుల్ జోష్‌లో ఉన్న తారక్.. ప్రస్తుతం 'దేవర' అనే హై ఓల్టేజ్ యాక్షన్ సినిమాలో నటిస్తున్నాడు.
వరుస హిట్లతో ఫుల్ జోష్‌లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్యూచర్ ప్రాజెక్టులను వరుసగా లైన్‌లో పెట్టుకుంటున్నాడు. ఇందులో భాగంగానే అతడు సలార్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో సినిమా చేయబోతున్నాడు. ఈ విషయాన్ని గత ఏడాదే అధికారికంగా ప్రకటించారు. అప్పటి నుంచి ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే దీన్ని తెరకెక్కించబోతున్నారు.

హై ఓల్డేజ్ యాక్షన్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాను గత ఏడాది ఏప్రిల్‌లో కానీ, మేలో కానీ మొదలు పెట్టే ఛాన్స్ ఉందని చెప్పారు. కానీ, అనివార్య కారణాల వల్ల ఇది ఆలస్యం అవుతోంది. దీంతో ఈ ప్రాజెక్టు ఆగిపోతుందని అంతా అనుకున్నారు. కానీ, ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఇటీవలే ఈ సినిమాను ఆగస్టు నుంచి ప్రారంభిస్తున్నారని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది.
జూనియర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ సినిమా ప్రారంభానికి చాలా సమయమే ఉన్నా.. ఇందులో నటించే హీరోయిన్ గురించి చాలా రకాల వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొణె హీరోయిన్‌గా ఎంపిక అయినట్లు చాలా రోజుల క్రితమే ఓ న్యూస్ వైరల్ అయింది. అలాగే, ఎంతో మంది హీరోయిన్ల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి.

తాజా సమాచారం ప్రకారం.. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌కు జోడీగా మరో బాలీవుడ్ భామ కియారా అద్వానీ నటిస్తుందని తెలిసింది. ఇప్పటికే ఆమెకు నిర్మాతలు అడ్వాన్స్ కూడా ఇచ్చారని అంటున్నారు. దీంతో ఈ జోడీపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. కియారా ప్రస్తుతం రామ్ చరణ్‌తో 'గేమ్ చేంజర్' మూవీలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉండగా.. జూనియర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, నందమూరి తారక రామారావు ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి 'డ్రాగన్' అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.


Click it and Unblock the Notifications











