Jr NTR 'వార్ 2'లో 'గేమ్ చేంజర్' భామ.. కథ మలుపు తిప్పే పాత్ర.. ఎన్టీఆర్ కు జోడీగా?
ఎన్నో ఏళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తన మార్క్ చూపిస్తూ దూసుకుపోతున్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన RRR సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ కావడమే కాదు గ్లోబల్ స్టార్ అయిపోయాడు. ఇందులో కొమురం భీమ్ పాత్రలో నటించి తారక్ నటనకు యావత్ ప్రపంచమే ఫిదా అయింది. అయితే ఈ పాపులారిటీతో తారక్ కు సినీ అవకాశాలు వివిధ చిత్ర పరిశ్రమల నుంచి వస్తున్నాయి. అందులో ఒకటే వార్ 2. దీంట్లో హీరోయిన్ గా గేమ్ చేంజర్ భామ రంగంలోకి దిగనుంది.
హిందీలో కూడా : రౌద్రం రణం రుధిరం (RRR) సినిమాతో ఇంటర్నేషనల్ స్థాయిలో పేరు సంపాదించుకున్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. ఈ సినిమా తర్వాత తారక్ చేసే ప్రాజెక్టులపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అందుకు తగినట్లుగానే ఎన్టీఆర్ సినిమాలను లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది. తారక్ తెలుగులోనే కాకుండా హిందీలో కూడా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

పూర్తి స్థాయిలో : తారక్ తెలుగులో కొరటాల శివతో దేవర సినిమా చేస్తుండగా.. ప్రశాంత్ నీల్ తో NTR31లో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇదే కాకుండా బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన వార్ సినిమా సీక్వెల్ అయినా వార్ 2లో తారక్ పవర్ ఫుల్ విలన్ గా దర్శనం ఇవ్వనున్నాడు. ఎన్టీఆర్ జై లవకుశ తర్వాత పూర్తి స్థాయిలో ప్రతినాయకుడిగా నటించడం ఇదే తొలిసారి.

బ్రహ్మాస్త్రం డైరెక్టర్ : బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ మెయిన్ హీరోగా తెరకెక్కుతున్న ఈ స్పై యూనివర్స్ మూవీ వార్ 2ను యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది. హృతిక్, టైగర్ ష్రాఫ్ నటించిన వార్ మూవీని పఠాన్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేయగా.. సీక్వెల్ మూవీ వార్ 2కి బ్రహ్మాస్త్ర డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించనున్నారు.

రామ్ చరణ్ హీరోయిన్ : నాలుగేళ్ల తర్వాత వస్తున్న ఈ సీక్వెల్ మూవీ వార్ 2ను వచ్చే ఏడాది సెట్స్ మీదకు తీసుకువెళ్లనున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. వార్ 2లో ఒక హీరోయిన్ గా బాలీవుడ్ భామ కియారా అద్వానీ ఎంట్రీ ఇవ్వనుందని వార్తలు వినిపిస్తున్నాయి. వార్ 2 కోసం రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' హీరోయిన్ కియారాను మేకర్స్ సెలెక్ట్ చేశారట.

తారక్ తో జోడీ : వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ లో భాగంగా వస్తున్న వార్ 2 చిత్రంలో కియారా అద్వానీ కథను మలుపు తిప్పే లేడీ స్పైగా కనిపించనుందట. ఈ విషయాన్ని త్వరలో మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారని టాక్. అయితే ఆమె హీరో అయినా హృతిక్ కు జోడీగా ఉంటుందా? లేదా విలన్ గా చేస్తున్న తారక్ తో జత కట్టనుందా? అనే విషయాలు తెలియరాలేదు.


Click it and Unblock the Notifications











