టాప్ డైరెక్టర్ కూతురుతో మహేష్‌ బాబు రొమాన్స్.. కియారా అద్వానీ అవుట్

సరిలేరు నీకెవ్వరు లాంటి బ్లాక్‌బస్టర్ సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న చిత్రం సర్కారు వారీ పాట. గీత గోవిందం లాంటి సూపర్ హిట్ అందించిన దర్శకుడు పరుశురాంతో జతకట్టి విభిన్నమైన కథతో ముందుకొస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ సినిమాలో నటించే హీరోయిన్‌ ఎంపిక గురించి రక రకాల కథనాలు మీడియాలో వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..

Recommended Video

Kiara Advani Walked Out From The Mahesh Babu's Movie
మహేష్ సరసన కొత్త హీరోయిన్

మహేష్ సరసన కొత్త హీరోయిన్

వారం రోజు క్రితం మహేష్ సరసన సర్కారు వారి పాట చిత్రంలో కియారా అద్వానీ నటిస్తున్నారు. భరత్ అనే నేను సినిమా తర్వాత మహేష్‌తో నటించే రెండో సినిమా అనే వార్త వినిపించింది. అయితే ఇప్పుడు మహేష్‌తో మరో హీరోయిన్ సాయి మంజ్రేకర్ నటిస్తున్నారనే వార్త ఆసక్తిగా మారింది.

డేట్స్ సమస్యతో కియారా అవుట్

డేట్స్ సమస్యతో కియారా అవుట్

అయితే లాక్ డౌన్ కారణంగా కియారాకు డేట్స్ అడ్జస్ట్ చేయడంలో ఇబ్బందులు ఏర్పడ్డాయి. దాంతో డేట్స్ సమస్య వల్ల కియారా అద్వానీ ఈ సినిమా నుంచి తప్పుకొన్నది. అందుకే మహేష్‌తో నటించలేకపోతున్నారు అంటూ తాజా కథనం వివరించింది. ఆమె స్థానంలో సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా ఖరారు అయిందనే వార్త వినిపిస్తున్నది.

సల్మాన్ హీరోయిన్‌తో మహేష్ బాబు

సల్మాన్ హీరోయిన్‌తో మహేష్ బాబు

సాయి మంజ్రేకర్ 29న జన్మించిన ఆమె ప్రముఖ నటుడు, దర్శకుడు మహేష్ మంజ్రేకర్ కూతురు. ధిరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో, యూనివర్సిటీ ఆఫ్ ముంబైలో చదువుకొన్నారు. తాజాగా దంబంగ్ 3 చిత్రంలో సల్మాన్ ఖాన్ సరసన నటించారు. ఉత్తమ తొలి చిత్ర నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డును గెలుచుకొన్నారు.

త్వరలోనే సెట్స్‌పైకి సర్కారు వారీ పాట

త్వరలోనే సెట్స్‌పైకి సర్కారు వారీ పాట

వాస్తవానికి సర్కారు వారి పాట చిత్రం ఎప్పుడో ప్రారంభం కావాల్సింది. అయితే లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాలేదు. ప్రస్తుతం లాక్‌డౌన్ విషయంలో సడలింపులను ప్రభుత్వం ఇవ్వడంతో సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X