ప్రభాస్‌తో కియారా రెడీ అంటున్న కియారా.. తెరపైకి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

ప్రభాస్‌తో స్టెప్పులేసేందుకు బాలీవుడ్ భామ కియారా అద్వానీ రెడీ అంటోందట. పాత్ర డిమాండ్ చేయాలే గానీ ఎలాంటి రోల్ అయినా పోషించడానికి రెడీగా ఉండే కియారా.. ప్రభాస్ సరసన ఓ ఐటెం సాంగ్‌లో చిందులేయడానికి సిద్దమైందట. ప్రస్తుతం ఈ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. వివరాలు చూస్తే..

 యాక్షన్ ఓరియెంటెడ్ మూవీ.. హై వోల్టేజ్ సీన్స్

యాక్షన్ ఓరియెంటెడ్ మూవీ.. హై వోల్టేజ్ సీన్స్

బాహుబలి లాంటి భారీ ప్రాజెక్టు తర్వాత ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో ఆయన తదుపరి సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు ప్రేక్షకులు. ఈ మేరకు బాహుబలి సిరీస్ తర్వాత ప్రేక్షకుల అంచనాలను రీచ్ అయ్యేలా కాస్త గ్యాప్ తీసుకొని సాహో సినిమా సెట్స్ పైకి వచ్చాడు ప్రభాస్. యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాగా హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలతో ఈ సినిమా తెరకెక్కుతోంది.

మసాలా ఐటెం సాంగ్

మసాలా ఐటెం సాంగ్

సాహూ షూటింగ్‌లో భాగంగా ఒళ్ళు గగ్గుర్లు పొడిచే యాక్షన్ సీక్వెన్స్‌లను దేశ విదేశాల్లో చిత్రీకరించారు. ఈ చిత్రంలో ఛేజింగ్ సన్నివేశాలు, హీరో ప్రభాస్‌తో పాటు హీరోయిన్ శ్రద్ద కపూర్ యాక్షన్ సీన్స్ కూడా షూట్ చేశారు. అయితే ఈ యాక్షన్ సన్నివేశాల మధ్య ప్రేక్షకులను ఫుల్ ఎంటర్‌టైన్ చేసేందుకు గాను మాంచి మసాలా ఐటెం సాంగ్ ప్లాన్ చేశారట యూనిట్ సభ్యులు. దీంతో ఈ సాంగ్‌లో ప్రభాస్‌తో చిందులేయబోయే హీరోయిన్ ఎవరనే దానిపై పలు వార్తలు షికారు చేస్తున్నాయి.

ప్రభాస్‌తో చిందులేసేందుకు కియారా రెడీ

ప్రభాస్‌తో చిందులేసేందుకు కియారా రెడీ

ప్రభాస్‌తో ఐటెం సాంగ్ అంటే మాస్ ఆడియన్స్ ఊగిపోవాల్సిందే. ఇప్పటికే ఆయన గత సినిమాలోని ఐటెం సాంగ్స్ ఉర్రూతలూగించడం కారణంగా సాహూ ఐటెం సాంగ్‌పై అందరి దృష్టి పడింది. అయితే మొదట ఈ ఐటెం సాంగ్‌ కోసం కాజల్, కత్రినా కైఫ్‌ల పేర్లు పరిశీలిస్తున్నారని తెలిసింది. కానీ తాజాగా ఫిలింనగర్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న సమాచారం మేరకు సాహూ ఐటెం సాంగ్ కోసం కియారా అద్వానీని కన్ఫర్మ్ చేశారని తెలుస్తోంది. కియారా కూడా ప్రభాస్‌తో ఐటెం సాంగ్ అనేసరికి స్పెషల్ ఇంట్రెస్ట్ చూపుతోందని అంటున్నారు.

మంచు కొండల్లో ప్రభాస్- శ్రద్ధ కపూర్‌ రొమాంటిక్ సాంగ్

మంచు కొండల్లో ప్రభాస్- శ్రద్ధ కపూర్‌ రొమాంటిక్ సాంగ్

ఇటీవలే ఆస్ట్రియాలోని మంచు కొండల్లో ప్రభాస్- శ్రద్ధ కపూర్‌ లపై ఓ రొమాంటిక్ సాంగ్ షూట్ చేశారు. ఇదే ఈ సినిమాలో ఫైనల్ సాంగ్ షూటింగ్ అన్నారు గానీ తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఐటెం సాంగ్ కూడా త్వరలోనే చిత్రీకరిస్తారని తెలుస్తోంది. ఇదే నిజమైతే భారీ యాక్షన్ సీన్స్ నడుమ ఈ ఐటెం సాంగ్ చిత్రానికే స్పెషల్ అట్రాక్షన్ అవుతుందనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.

సాహూ మూవీ

సాహూ మూవీ

యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై సుజీత్ దర్శకత్వంలో దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న 'సాహూ' మూవీ ఆగస్టు 15 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్రంలో ప్రభాస్ సరసన శ్రద్ద కపూర్ నటిస్తుండగా.. నీల్ నితిన్ ముఖేష్, టైగర్ ష్రాఫ్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్ లాంటి భారీ తారాగణం పాలు పంచుకుంటోంది. విడుదలకు ముందే భారీ బజ్ ఏర్పడటంతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరిగింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X