జాక్‌పాట్ కొట్టేసిన కియారా.. ఇదే జరిగితే ఇక ఆమె కెరీర్ టర్న్ అయినట్లే!
టాలీవుడ్, బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అక్కర లేని పేరు కియారా అద్వానీ. చేసింది కొన్ని సినిమాలే అయినా స్టార్ హీరోయిన్‌గా క్రెడిట్ కొట్టేసి క్రేజీ హీరోయిన్ గా మారింది కియారా. బోల్డ్ క్యారెక్టర్స్ చేయడం, సీన్‌లో జీవించి నటించడం ఆమె లోని బెస్ట్ క్వాలిటీ అని చెప్పుకోవచ్చు. ఇప్పటిదాకా టాలీవుడ్, బాలీవుడ్ ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ భామ ఇక కోలీవుడ్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమవుతోందట. తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు ఆమెకు కోలీవుడ్ స్టార్ హీరో సరసన అవకాశం దక్కిందని తెలుస్తోంది.
లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ హీరోగా తెరకెక్కనున్న చిత్రంలో కియారాను హీరోయిన్ గా సెలెక్ట్ చేశారని తెలుస్తోంది. విజయ్ కెరీర్ లో 64వ సినిమాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు కియారా కోలీవుడ్ ఎంట్రీ కోసం ఆశగా ఎదురుచూస్తోందట. సరిగ్గా ఈ తరుణంలో విజయ్ సరసన నటించే అవకాశం ఆమె తలుపు తట్టిందని సమాచారం. ఇదే జరిగితే ఆమెకి కోలీవుడ్ నుంచి జాక్‌పాట్ తగిలినట్లే. పైగా ఈ సినిమా హిట్ అయ్యినదంటే ఉత్తరాది, దక్షిణాది స్టార్ హీరోయిన్ గా కీర్తించబడే లక్కీ ఛాన్స్ కియారా సొంతమవుతుంది.

గతంలో మహేష్ లాంటి పెద్ద స్టార్‌తో నటించి 'భరత్ అనే నేను' సినిమా ద్వారా తెలుగు తెరపై అడుగుపెట్టిన కియారా అద్వానీ.. మొదటి చిత్రంతోనే సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత రామ్ చరణ్ సరసన 'వినయ విధేయ రామా' చిత్రంలో నటించి భేష్ అనిపించుకుంది. ఇక ఇటీవలే బాలీవుడ్ లో కబీర్ సింగ్ రూపంలో భారీ హిట్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు ''గుడ్ న్యూస్, లక్ష్మీ బాంబ్'' సినిమాలతో బిజీగా ఉంది.


Click it and Unblock the Notifications











