గుంటూరు కారంలో స్టార్ హీరోయిన్ ఐటెం సాంగ్.. ఇది అస్సలు ఊహించరు భయ్యా!
ఆ మధ్య వరుసగా హిట్లు మీద హిట్లు కొట్టినా.. గత చిత్రంతో నిరాశనే ఎదుర్కొన్నాడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు. దీంతో ఈ సారి ఎలాగైనా భారీ విజయాన్ని ఖాతాలో వేసుకోవాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఇందుకోసం ఈ బడా స్టార్ హీరో ఇప్పుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 'గుంటూరు కారం' అనే సినిమాను చేస్తోన్న విషయం తెలిసిందే.
ఫుల్ లెంగ్త్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న 'గుంటూరు కారం' సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగానే ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇక, ఈ సినిమా షూటింగ్ విషయంలో కొన్ని బ్రేకులు రావడంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ఇది యాభై శాతం వరకూ మాత్రమే పూర్తి చేసుకోగలిగింది.

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ బాబు వెకేషన్‌లో ఉన్నాడు. అతడు వచ్చిన తర్వాత 'గుంటూరు కారం' మూవీకి సంబంధించిన షూటింగ్ పున: ప్రారంభం అవుతుందనే టాక్ వినిపిస్తోంది. అప్పటి నుంచి ఏమాత్రం బ్రేకులు లేకుండానే దీన్ని పూర్తి చేసేలా చిత్ర యూనిట్ ప్లాన్లు చేసుకుంటుందని అంటున్నారు.
దాదాపు పుష్కర కాలం తర్వాత సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తోన్న 'గుంటూరు కారం' మూవీలో అదిరిపోయే ఐటెం సాంగ్‌ను కూడా పెడుతున్నారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఈ క్రమంలోనే ఎంతో మంది బడా, స్మాల్ హీరోయిన్ల పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. కానీ, ఈ విషయంలో మాత్రం ఇప్పటి వరకూ ఎలాంటి క్లారిటీ రాలేదనే చెప్పాలి.

తాజా సమాచారం ప్రకారం.. 'గుంటూరు కారం' మూవీలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ స్పెషల్ సాంగ్ చేయబోతుందట. ఇప్పటికే ఆమె దీనికోసం డేట్స్ కూడా కేటాయించినట్లు తెలిసింది. మహేశ్ బాబు అందుబాటులో ఉండేదాన్ని బట్టి షూట్ ప్లాన్ చేస్తారని సమాచారం. ఇదిలా ఉండగా.. గతంలో ఆమె అతడితో కలిసి 'భరత్ అను నేను' సినిమాను చేసింది.
'గుంటూరు కారం' సినిమాను హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా చేస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇందులో ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం సహా ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతికి విడుదల అవుతుందనే టాక్ వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











