Spirit: ప్రభాస్ సరసన రామ్ చరణ్ హీరోయిన్.. సందీప్ రెడ్డి వంగా ప్లాన్ గట్టిగానే..

Prabhas Spirit: సెన్సెషనల్ డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగా 'స్పిరిట్' అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ భారీ బడ్జెట్ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. వరుస హిట్స్ తో దూకుడు మీద ఉన్న ప్రభాస్, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబోలో ఈ మూవీ రావడంతో అంచనాలు అమాంతం పెరిగాయి. హోప్స్ ను మరింత హైప్ అయ్యేలా.. ఈ క్రేజీ మూవీలో రామ్ చరణ్ హీరోయిన్ నటించబోతుందనే ఓ క్రేజీ వార్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే ?

సన్సెషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంతో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్నసినిమా స్పిరిట్. సందీప్ రెడ్డి టేకింగ్ గురించి, ఆయన డైరెక్షన్ చేసిన మూవీస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ సినిమాలు చూస్తే.. ఆయన రేంజ్ ఏంటో అర్థమవుతోంది. అర్జున్ రెడ్డి మూవీతో విజయ్ దేవరకొండను స్టార్ హీరో గా మార్చారు. అలాగే.. బాలీవుడ్ లో కబీర్ సింగ్ మూవీతో షాహిద్ కు, యానిమల్ సినిమాతో రణ్ బీర్ కపూర్ లకు ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చారు. ఇప్పటి వరకూ సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేసిన ప్రతి సినిమా హిటే.

kiara advani will act in Prabhas- Sensational Director Sandeep Reddy combo Movie Spirit

ఇక ప్రభాస్ విషయానికి వస్తే.. కల్కి 2898 AD మూవీ సక్సెస్ తో యంగ్ రెబల్ స్టార్ దూకుడు పెంచారు. ప్రస్తుతం సక్సెస్ పుల్ డైరెక్టర్ మారుతి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న 'రాజా సాబ్' మూవీలో నటిస్తున్నారు. రొమాంటిక్ కామెడీ లవ్ స్టోరీ వస్తున్నఈ మూవీ షూటింగ్ త్వరలో పూర్తి కావొస్తుంది. ఆ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూవీ తరువాత హనుమ రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ మూవీలో నటించనున్నారు ప్రభాస్. ఈ మూవీ షూటింగ్ ఇటీవలే మొదలైంది. ఈ రెండు సినిమాల తరువాత స్పిరిట్‌ సెట్స్‌ పైకి రానున్నది.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు సందీప్ రెడ్డి. ఈ మూవీలో రాజా సాబ్‌, ఫౌజీతో మూవీస్ లో కంటే.. స్పిరిట్ లో ప్రభాస్ మరింత అగ్రిసీవ్ గా కనిపించనున్నారట. ఈ మూవీలో ప్రభాస్ పోలీస్‌ఆఫీసర్ గా కనిపించనున్నారట. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లూక్ ఓ రేంజ్ లో ఉంది. ఇప్పటికి వరకు ప్రభాస్ ను అలా చూసి ఉండరు. యాక్టన్ మూవీలో ప్రభాస్ ను చాలా పవర్‌పుల్ గా చూపించాలని భావిస్తున్నారట. ఇప్పటికే ప్రభాస్ లుక్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.
ఇదిలా ఉంటే.. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రభాస్ సరసన నటించబోతున్నారట.

ఆ హీరోయిన్ ఎవరో కాదు.. బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ కియారా అడ్వాణీ. ప్రభాస్ సరసన నటించాలని ప్రతి ఒక్క హీరోయిన్ కు ఉంటుంది. ఈ అవకాశం కొద్దిమందికి మాత్రమే వస్తుంది. ఇండస్ట్రీ టాక్ ప్రకారం.. స్పిరిట్ కోసం బాలీవుడ్ క్రష్ రష్మిక మందన, హాట్ బ్యూటీ కియారా అద్వానీ సెలెక్ట్ చేశారు. అయితే వీరిలో రష్మిక మందాన వర్ష సినిమాలతో బిజీబిజీగా ఉండటంతో ఆ మన సైడ్ కి తప్పించి.. కియారా అద్వానీని తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి కియారా అద్వానీ పలు తెలుగు సినిమాలలో నటించి మెప్పించింది.

kiara advani will act in Prabhas- Sensational Director Sandeep Reddy combo Movie Spirit

గతంలో భరత్ అనే నేను వినయ విధేయ రామ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయింది. ఆటో బాలీవుడ్లో ఫగ్లి నటించి పలువురి ప్రశంసలు అందుకుంది, అలాగే ఈ ఏడాది విడుదలైన సత్య ప్రేమ్ కి కథ సినిమాలో కూడా నటించి మెప్పించింది. ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజెర్ మూవీలో కూడా హీరోయిన్గా యాక్ట్ చేసింది. ఇలా టాలీవుడ్ లో బాలీవుడ్ లో మంచి ప్లేస్ సంపాదించుకున్న కియారా అద్వానీని హీరోయిన్గా ఫైనల్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X