ఎన్టీఆర్ పుట్టిన రోజున రవితేజ ‘కిక్-2’ రిలీజ్
హైదరాబాద్: రవితేజ హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కిక్-2'. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై నందమూరి కల్యాణ్‌రామ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని నందమూరి తారక రామారావు(సీనియర్ ఎన్టీఆర్) పుట్టిన తేది అయిన మే 28,2015 న విడుదల చేయటానికి నిర్మాత నందమూరి కళ్యాణ రామ్ నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్‌లుక్, టీజర్‌ను విడుదల చేశారు.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఈ సినిమా ‘కిక్'కు సీక్వెల్ కాదు. కానీ అందరికీ డబుల్ కిక్ ఇస్తుంది. ‘కిక్'లో రవితేజ, ఇలియానా జంటగా నటించారు. వాళ్లిద్దరి కొడుకు కథే ‘కిక్-2'. ఇటీవలే రాజస్థాన్‌లోని జైసల్మీర్‌లో క్లైమాక్స్‌ను భారీగా తెరకెక్కించాం. త్వరలో హైదరాబాద్‌లో తదుపరి షెడ్యూల్ ఉంటుంది'' అని తెలిపారు.

నందమూరి కల్యాణ్‌రామ్ మాట్లాడుతూ ‘‘అతనొక్కడే వంటి హిట్ తర్వాత సురేందర్‌రెడ్డి మా సంస్థలో చేస్తున్నారు. రవితేజ హీరోగా ఈ చిత్రం రూపొందుతోంది. హై టెక్నికల్ వేల్యూస్‌తో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను రూపొందిస్తున్నాం. వేసవికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని తెలిపారు.
ఆద్యంతం వినోద ప్రధానంగా సాగే చిత్రమని రవితేజ అన్నారు. 'కిక్'లో జంటగా నటించిన రవితేజ, ఇలియానా పాత్రల కొడుకు కథే ఈ 'కిక్ 2' అని దర్శకుడు తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ...యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో రవితేజ మార్క్ ఎంటర్‌టైనర్‌తోపాటు సురేందర్ రెడ్డి, తమన్నా మ్యాజిక్ మళ్లీ రిపీట్ కానుంది. ఈ చిత్రం మే 28, 2015న విడుదల చేస్తామన్నారు.
ఈ చిత్రంలో రవితేజ సరసన రకూల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. ఈ సినిమాకు కథ: వక్కంతం వంశీ, సంగీతం: యస్.యస్.థమన్, కెమెరా: మనోజ్ పరమహంస, ఎడిటింగ్: గౌతంరాజు, ఆర్ట్: నారాయణరెడ్డి, ఫైట్స్: రామ్-లక్ష్మణ్.


Click it and Unblock the Notifications











