'కిక్ -2':ఎన్టీఆర్ కు 12 కోట్లు నష్టం

By Srikanya

హైదరాబాద్ : రవితేజ,సురేంద్రరెడ్డి కాంబినేషన్ లో వచ్చి డిజాస్టర్ ఫలితం చూసిన'కిక్ -2' చిత్రం ఎన్టీఆర్ కు 12 కోట్లు నష్టం తెప్పించిదనే వార్త ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. దానికి కారణం ఎన్టీఆర్ ఈ చిత్రం నిర్మాణంలో తన సోదరుడు కళ్యాణ్ రామ్ కు ఆర్దికంగా సాయిం చేయటమే అని చెప్తున్నారు. చిత్రం పోస్ట్ ప్రొడక్ష న్ సమయంలో ఆరు కోట్ల రూపాయలు ఎన్టీఆర్ నుంచి అప్పు తీసుకున్న కళ్యాణ్ రామ్ , రిలీజ్ సమయంలో మరో ఆరు కోట్లు తీసుకోవాల్సి వచ్చిందని సమాచారం. అయితే ఇది సొమ్ము రూపంలో కాదు.

ఈ చిత్రాన్ని రిలీజ్ చేయటానికి దిల్ రాజు ఆరు కోట్లు అడిగారని, అయితే దిల్ రాజు డబ్బు రూపంలో కాకుండా డేట్స్ రూపంలో ఎన్టీఆర్ ని అడిగాడని, అలా కిక్ 2 రిలీజైందని తెలుస్తోంది. ఈ ఆరు కోట్లు అడ్వాన్స్ పేమెంట్ గా దిల్ రాజు ఇచ్చినట్లు అయ్యిందంటున్నారు. సినిమాకు మార్నింగ్ షోకే నెగిటివ్ టాక్ రావటంతో రూపాయి కూడా రికవరీ కాలేదని, దిల్ రాజు దగ్గర మాత్రం ఎన్టీఆర్ డేట్స్ ఇరుక్కుపోయాయని చెప్తున్నారు. అంతేకాదు మొదట ఇచ్చిన ఆరు కోట్లు కూడా ఎన్టీఆర్ వద్దన్నాడని చెప్పుకుంటున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఎన్టీఆర్ తాజా చిత్రం విషయానికి వస్తే...

Kick 2 effect: 12 cr Loss for Jr NTR

ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌ హీరోగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 8,2016న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ లోగా దసరా పండుగను పురస్కరించుకుని అక్టోబర్ 22న టీజర్ ని విడుదల చేయాలని నిర్ణయించా4రు. అలాగే టైటిల్ లోగోను సెప్టెంబర్ 17న విడుదల చేయనున్నారు.

తాజగా... ఈ సినిమా కోసం లండన్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ని 26 వ ఫ్లోర్ లో ఆఫీస్ సెట్ వేసారు. ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తోన్న జగపతి బాబు ఆఫీసు గా ఇది కనిపించనుంది. ఇందుకోసం 60 లక్షలకు పైనే ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. ఇంటర్వెల్ కు ముందు జగపతిబాబుకు, ఎన్టీఆర్ కు మధ్య వచ్చే కీలక సన్నివేశం కోసం ఈ సెట్ వేసినట్లు తెలుస్తోంది. ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ ఈ సెట్‌కు రూపకల్పన చేశారని సమాచారం. అక్కడ లండన్ వర్కర్స్ కొందరు ఈ సెట్ నిర్మాణంలో పాలుపంచుకున్నట్లు చెప్తున్నారు.

ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ మాట్లాడుతూ... సాధారణంగా సెట్స్‌లోనే తీసే సన్నివేశాలకైతే ఇక్కడే అలాంటి ఏర్పాట్లు చేస్తుంటామని, సుకుమార్ పర్‌ఫెక్షన్ కోసం లండన్‌లోనే ఆఫీస్ ఎలా ఉండాలి అనే దానిప్రకారం సెట్ వేసినట్లు ఆయన తెలిపారు. ఎన్టీఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమా బీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మాత.

Kick 2 effect: 12 cr Loss for Jr NTR

సంక్రాంతి కానుకగా జనవరి 8న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఈ సినిమాకి 'నాన్నకు ప్రేమతో...' అనే పేరు ప్రచారంలో ఉంది. ఈ చిత్రాన్ని తమిళంలో డబ్బింగ్ చేసి అదే రోజు విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ మేరకు ఏర్పాట్లు జరగుతున్నట్లు సమాచారం. అందులో భాగంగా కొందరు తమిళ నటుల్ని కీలకమైన పాత్రలకు తీసుకుందామనే ఆలోచనలో దర్శక,నిర్మాతలు ఉన్నట్లు తెలుస్తోంది.

దర్శకుడు మాట్లాడుతూ ''ఎన్టీఆర్‌ని కొత్త తరహా పాత్రలో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఆయన తెరపై కనిపించే విధానం భిన్నంగా ఉంటుంది. ఇదివరకటితో పోలిస్తే మరింత స్త్టెలిష్‌గా కనిపిస్తారు. ఎన్టీఆర్‌ కోసం ప్రత్యేకంగా ఓ బైక్‌ని తయారు చేయించాం. అది చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది''అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ ''ఎన్టీఆర్‌ సినీ ప్రయాణానికీ, మా సంస్థకి ఎంతో ప్రతిష్ఠాత్మకమైన చిత్రమిది. ఆ తర్వాత స్పెయిన్‌లో జరిగే షెడ్యూల్‌తో సినిమా పూర్తవుతుంది'' అన్నారు. జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

అలాగే.. ఈ చిత్రం కొన్ని కొత్త విషయాలు బయిటకు వచ్చాయి. ఈ చిత్రానికి 'నాన్నకు..ప్రేమతో' టైటిల్ నే ఫైనలైజ్ చేయనున్నారు. అలాగే ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఇంటర్ పోల్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పేరు అభిరామ్. అయితే ఇదే ఖరారు అని చెప్పలేం. ఇవి ఫిల్మ్ సర్కిల్ లో ప్రచారంలో ఉన్న విషయాలు మాత్రమే.

దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ... ఎన్టీఆర్ తో ఫస్ట్ టైమ్ వర్క్ చేయటం చాలా ఎక్సైటింగ్ గా ఉంది. తారక్ లో ఎంతో ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీని ఎలివేట్ చేసే స్కోప్ ఉన్న సబ్జెక్ట్ ఇది. ఇది ఓ రివేంజ్ డ్రామా. డిఫెరెంట్ స్టైల్ లో ఉంటుంది అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ... ఎన్టీఆర్, సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ చిత్రంలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఎన్టీఆర్ కు డిఫెరెంట్ మూవి అవుతుంది. సబ్జెక్టు చాలా ఎక్సట్రార్డనరీగా ఉంది అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X