రవితేజతో మరోసారి నటించటానికి కమిటైన 'కిక్' శ్యామ్
కిక్ తో పరిచయమైన కిక్ శ్యామ్ మరో సారి రవితేజ తాజా చిత్రం వీర లో చేయటానికి రెడీ అయ్యారు. రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో శ్యామ్ ఓ కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. టాలీ టు హాలీ మూవీస్ బ్యానర్ పై గణేష్ ఇందుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో కాజల్, తాప్సీ, మంజరి హీరోయిన్స్ గా చేస్తున్నారు. సంక్రాంతికి రవితేజ ప్రస్తుతం చేస్తున్న మిరపకాయ విడుదల ప్లాన్ చేసారు. అలాగే మే నెలలో ఈ వీర రెడీ అవనుంది. ఇక కిక్ శ్యామ్ తెలుగులో పూర్తి బిజీగా మారుతున్నారు. రీసెంట్ గా విడుదలైన కళ్యాణ్ రామ్ కత్తి లో కీలకమైన పాత్రను పోషించిన శ్యామ్ నటిస్తున్న రెండు తెలుగు చిత్రాలు బుధవారం హైదరాబాద్ లో ప్రారంభమయ్యాయి. అందులో ఒకటి ఎన్టీఆర్, తమన్నా జంటగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న 'రచ్చ' చిత్రం, మరోకటి ప్రియమణి, జగపతి బాబు కలయికలో రూపొందుతున్న 'క్షేత్రం' కావటం విశేషం.


Click it and Unblock the Notifications











