యువ రాజశేఖర్ రెడ్డి పాత్రలో ఆ యంగ్ హీరో
దర్శకుడు పూరీ జగన్నాధ్ రూపొందించనున్న రాజశేఖర రెడ్డి జీవిత చరిత్ర సినిమాలో యువ రాజశేఖర్ రెడ్డి పాత్రలో కిక్ శ్యామ్ కనపడనున్నారు. కిక్ లో పోలీస్ ఆఫీసర్ గా కనిపించి అలరించిన ఆయనకు ఫోటో షూట్ చేసి పూరీ ఈ పాత్రకు తీసుకోనున్నారని సమాచారం. ఇక రాజకీయ నాయుకుడుగా, ముఖ్యమంత్రిగా ఎదిగిన వైయస్ పాత్రలో హీరో రాజశేఖర్ కనిపిస్తారు. ఇక రాజశేఖర రెడ్డి భార్య పాత్రలో జీవితను తీసుకునే అవకాశం ఉంది. ఇక జగన్మోహన రెడ్డిగా కూడా రాజశేఖరే కనిపిస్తారని చెప్తున్నారు. ఈ పాత్రలో కిక్ శ్యామ్ మెప్పిస్తే తెలుగులో తిరుగు ఉండదంటున్నారు. తమిళంలో అంతంత మాత్రం అవకాశాలతో ఉన్న శ్యామ్ తెలుగులో బిజీ కావటంతో మరికొంతమంది తమిళ హీరోలు కూడా ఇక్కడ చిత్రాల్లో ప్రాముఖ్యత ఉన్న పాత్రలు చేయటానికి ముందుకొస్తున్నారు. అయితే ఇప్పటివరకూ ఒకరిద్దరు ఫైనలైజ్ అయినా పూర్తి స్దాయిలో ఎవరు కనిపించనున్నారనేది సస్పెన్స్. ఇక పూరీ దయానాయక్ జీవిత చరిత్ర ఆధారంగా గోలీమార్ చిత్రాన్ని సైతం రూపొందించనున్నారు. ఆ ప్రాజక్టు కోసం కొంత రీసెర్చి జరుపుతున్నారు. ఈ రెండు ప్రాజెక్టులు బయోపిక్ లుగా నిలబడిపోయేలా రూపొందించాలని పూరి సంకల్పం.


Click it and Unblock the Notifications











