నన్ను చంపేయండి అంటూ గబ్బర్ సింగ్ నిర్మాత?
"గబ్బర్ సింగ్" హిట్ కాకపోతే నన్ను చంపండి అని ఆ చిత్ర నిర్మాత బండ్ల గణేష్ వ్యాఖ్యానించినట్లు ఫిల్మ్ నగర్లో ప్రచారం జరుగుతోంది. మరో వైపు ఆయన అలా అన లేదని, సినీ పరిశ్రమలో ఉండే వాడు కార్గిల్ సైనికుడు లాంటి వాడు...యద్ధంలో కాల్చడం ఆపి రిలాక్స్ అయితే సైనికుడు శత్రువుల తూటాలకు బలౌతాడు. సినీ పరిశ్రమలో ఏ కారణం చేతనైనా విరామం ఏర్పడితే వారి సినీ జీవితం ఎండ్ అయినట్లే అని ట్విట్టర్లో చేసిన కామెంట్స్ ను కొందరు తప్పుగా ప్రచారం చేస్తున్నారని గణేష్సన్నిహితులు అంటున్నారు.
పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, శృతి హాసన్ హీరోయిన్ గా, "మిరపకాయ్" ఫేం హరీష్ శంకర్ దర్శకత్వంలో బండ్ల గణేష్ "గబ్బర్ సింగ్" చిత్రం రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. హిందీలో సూపర్ హిట్టయిన "దబాంగ్" చిత్రానికి ఇది రీమేక్. ఫిబ్రవరి 14 వ తేదీ, అంటే వేలంటైన్స్ డే రోజున ఈ "గబ్బర్ సింగ్" చిత్రం టీజర్ విడుదలవుతుంది.
గబ్బర్ సింగ్ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ పూరి జగన్నాథ్ తో సినిమా చేయబోతున్నాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'బద్రి' భారీ విజయం సాధించిన నేపథ్యంలో మళ్లీ వీరి కాంబినేషన్ రిపీట్ అవుతుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.


Click it and Unblock the Notifications











