»   » నవదీప్ తో కిమ్ శర్మ జిమ్ జిమ్!

నవదీప్ తో కిమ్ శర్మ జిమ్ జిమ్!

Subscribe to Filmibeat Telugu

నవదీప్, కిమ్ శర్మ మధ్య ప్రేమాయణం జోరుగా హోరుగా సాగుతున్నట్టు తెలుస్తోంది. ఎప్పుడూ జిమ్ జిమ్ లాడే కిమ్ శర్మ క్రికెటర్ యువరాజ్ తో ప్రేమకు గుడ్ బై చెప్పేసిన తర్వాత నవదీప్ లో ఆమెకు బాగా నచ్చిన లవర్ బాయ్ కన్పించాడట. వీరిద్దరు భూమికతో కలిసి "యాగం" చిత్రంలో నటించారు.

ఇటీవల నవదీప్, భూమికల మీద బ్యాంకాక్ లో మంచి రసపట్టు సీన్లు చిత్రీకరించారు. ఆ సీన్లలోవారిద్దరూ జీవిచడంతో సీన్లు బాగా పండి నిర్మాత, దర్శకులకు ఆనందం కలిగించాయట. వారిద్దరి మధ్య బాడీ కెమిస్ట్రీ గొప్పగా ఉందట. నవదీప్ ను చూడకండా కిమ్ శర్మ ఒక్క రోజు కూడా ఉండలేకపోతోందట. నవదీప్ కోసమే ఆమె హైదరాబాద్ కు మకాం మార్చినట్టు సమాచారం. అంతే కాదు ఇద్దరూ తరచుగా పబ్ లలో కన్పిస్తున్నారట.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu