వర్మ 'ఒట్టు': మోహన్ బాబు కొడుకుగా కిషోర్

ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ జరుగుతోంది. ఇక్కడ వచ్చే నెల 11 వరకు షూటింగ్ ప్లాన్ చేసారు. మోహన్ బాబు నిర్మించే ఈ చిత్రం రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని చెప్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని చెప్తున్నారు. మోహన్‌బాబు, మంచు విష్ణు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.
ఇప్పుడిప్పుడే గాడిలో పడ్డ విష్ణు....వర్మ దర్శకత్వంలో సినిమా ఒప్పుకోవడంపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. వర్మ స్వార్థానికి విష్ణు బలి కాబోతున్నాడని కొందరు అభిప్రాయ పడుతున్నారు. వర్మ ఒకప్పుడు గొప్ప దర్శకుడే, ప్రేక్షకుల అభిరుచికి తగినట్లుగా సినిమాలు తీసిన దర్శకుడే అయినప్పటికీ.....ఈ మధ్య ఆయన మైండ్ సెట్ పూర్తిగా మారిందని, ప్రేక్షకుల అభిరుచికి విలువ ఇవ్వకుండా తన స్వార్థానికి...ఇష్టం వచ్చినట్లుగా సినిమాలు తీస్తూ ప్రేక్షకులను టార్చర్ పెడుతున్నాడని, అందుకు ఇటీవల వచ్చిన ఆయన సినిమాలే నిదర్శనమని అంటున్నారు. కాగా...'దూసుకెళ్తా' విజయంతో మంచి జోష్ మీద ఉన్న విష్ణు ప్రస్తుతం తన తండ్రి మోహన్ బాబు, తమ్ముడు మనోజ్‌తో కలిసి 'పాండవులు పాండవులు తుమ్మెద' చిత్రంలో నటిస్తున్నాడు


Click it and Unblock the Notifications











