MegaStar Chiranjeevi: భోళాశంకర్ షాక్‌లో ఉన్న మెగా ఫ్యాన్స్‌కి మరో టెన్షన్.. చిరంజీవికి సర్జరీ?

చిరంజీవి ఈ మధ్య కుర్ర హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఆయన సెకండ్ ఇన్నింగ్స్ లో ఫుల్ జోష్ మీద సినిమాలు చేస్తున్నారు. తాజాగా భోళా శంకర్ అనే సినిమాతో వచ్చారు. కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ భోళా శంకర్ షాక్ మరువక ముందే చిరు ఫ్యాన్స్ కు కొత్త టెన్షన్ మొదలైంది. ఆయనకు వైద్యులు మోకాలు సర్జరీ చేయనున్నారట. ఆ వివరాల్లోకి వెళితే..

చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ లో ఖైదీ నంబర్ 150 సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఇక ఈ మూవీ తమిళ సినిమా కత్తి సినిమాకు రీమేక్. అయినప్పిటికీ ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్టుగా నిలిచింది. ఇక ఆ తర్వాత సైరా నరసింహరెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇది పర్వాలేదనిపించింది. ఇక ఆ తర్వాత ఎన్నో ఆశలతో ఆచార్య అనే సినిమా చేశారు చిరు. ఇక ఈ మూవీ దారుణ పరాజయాన్ని పొందింది.

knee surgery to Megastar Chiranjeevi News Viral in Social Media

అయితే మళ్లీ రీమేక్ నే నమ్ముకున్న చిరు.. మలయాళం సూపర్ హిట్టు లుసిఫర్ ను.. తెలుగు నెటివీటికి తగ్గట్లుగా మార్చి గాడ్ ఫాదర్ అనే సినిమా చేశారు. ఇక మూవీ సూపర్ హిట్టుగా నిలిచింది. ఆ తర్వాత ఈ ఏడాది ప్రారంభంలో బాబీ దర్శకత్వంలో రవితేజతో కలిసి వాల్తేరు వీరయ్య్ అనే సినిమా చేయగా.. ఇక ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద కలక్షన్ల వర్షం కురిపించింది.

ఇక తాజాగా చిరంజీవి మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తమన్నా హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం భోళా శంకర్. ఈ సినిమా ఆగస్టు 11న రిలీజ్ అయి మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రం కూడా రీమేక్ కావడం విశేషం. అయితే ఈ సినిమాలో చిరుకు చెల్లెలిగా కీర్తి సురేష్ నటించింది. సుశాంత్ ఓ కీలక పాత్రలో నటించారు. ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర భారీ బడ్జెట్ తో నిర్మించారు.

knee surgery to Megastar Chiranjeevi News Viral in Social Media

భోళా శంకర్ సినిమా షాక్ నుంచి తేరుకోకముందే చిరు ఫ్యాన్స్ కు మరో టెన్షన్ పట్టుకుంది. అయితే చిరు కొన్నాళ్లుగా మోకాలి నొప్పితో బాధపడుతున్నారని సమాచారం. ఆ మధ్య చిరంజీవి భార్యతో కలిసి అమెరికా కూడా వెళ్లారు. అది వెకేషన్ ట్రిప్ అని చెప్పి వెళ్లారు.. కానీ అది చిరంజీవి మోకాలి సర్జరీ కోసం వెళ్లారనే వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు మరో వార్త బయటకు వచ్చింది.

knee surgery to Megastar Chiranjeevi News Viral in Social Media

చిరంజీవి మోకాలు ఆపరేషన్ ఈ వారం జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఢిల్లీ లేదా బంగళూరులో జరగొచ్చని సమాచారం. నెలన్నర పాటు విశ్రాంతి తీసుకుంటారట. ఈ నెలాఖరు వరకు హైదరాబాద్ లో అందుబాటులో ఉండరని తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఆందోళన చెందుతున్నారు. చిరు త్వరగా కోలుకుని రావాలని ఆకాంక్షిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X