42 ఏళ్ల బాలీవుడ్ బ్యూటీతో అభిషేక్ డేటింగ్.. ఇంతకీ ఆ అమ్మడు ఎవరు?
బాలీవుడ్ స్టార్ కపుల్ అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్ మధ్య విభేదాలు వచ్చాయని, వీరిద్దరూ విడాకులు కూడా తీసుకోబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ స్టార్ కపుల్ విడాకుల రూమార్స్ కు 42 ఏళ్ల బాలీవుడ్ హీరోయిన్ కారణమంటూ మరో వార్త నెట్టింట్లో ప్రచారంలోకి వచ్చింది. ఇంతకీ ఆమె ఎవరు? బ్యాక్ గ్రౌండ్ ఏంటీ అనే విషయాలపై చర్చ నడుస్తోంది. మీరు కూడా ఓ లూక్కేయండి.
బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కుటుంబంలో కొన్నినెలలుగా విడాకుల అలజడులు రేగుతున్నాయి. అభిషేక్ బచ్చన్ - ఐశ్వర్యా రాయ్ మధ్య విభేదాలు వచ్చాయని, వారిద్దరూ విడాకులు కూడా తీసుకోబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో తామిద్దరం కలిసే ఉన్నామని పరోక్షంగా స్పందిస్తున్న ఆ రూమర్స్ కు మాత్రం చెక్ పడడం లేదు. ప్రధాన కారణంగా అభిషేక్, ఐశ్వర్య లు కలిసి కనిపించక చాలా కాలం అవుతోంది. ఐశ్వర్య తరుచు తన కూతురు ఆరాధ్యతో కలిసి ఫంక్షన్లను, ఈవెంట్లకు హాజరవుతోంది. అయితే.. అభిషేక్ బచ్చన్ విడాకులకు ఓ బాలీవుడ్ నటి కారణమంటూ మరో వార్త ప్రచారంలోకి వచ్చింది..

అభిషేక్ బచ్చన్, నిమ్రత్ కౌర్‌తో రిలేషన్‌లో ఉన్నారనీ, ఈ విషయం ఐశ్వర్యకి తెలియడంతో వీరి వైవాహిక బంధంలో కలహాలు వచ్చాయంటూ కొన్ని రూమార్స్ ప్రచారంలో ఉన్నాయి. 2022లో అభిషేక్, నిమ్రత్ కౌర్ లు కలిసి 'దస్వీ' అనే మూవీలో నటించారు. ఈ మూవీ షూటింగ్ సమయంలోనే వీరి మధ్య పరిచయం ఏర్పడిందనీ, ఆ పరిచయం రిలేషన్ షిప్ కు దారి తీసిందనే వదంతులు వస్తున్నాయి. రూమర్ల మధ్య అభిషేక్, ఐశ్వర్య విడాకులకు సిద్దమయ్యారనే ప్రచారం జరుగుతోంది. అలాగే స్టార్ కపుల్ విడిపోవడానికి కారణం అంటూ నిమ్రత్ కౌర్‌ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.
ఈ తరుణంలో నిమ్రత్ కౌర్ ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటీ? అనే విషయాల గురించి ఆరా తీసుకున్నారు ఫ్యాన్స్. నిమ్రత్ కౌర్ 1982 మార్చి 13న రాజస్థాన్‌లోని పిలానీలో ఒక సిక్కు కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి మేజర్ భూపిందర్ సింగ్. నిమత్ర్ కౌర్ 12 ఏళ్లులో కాశ్మీరీ తిరుగుబాటుదారులు చేతిలో తన తండ్రి హత్యకు గురయ్యారు. ఈమె ఢిల్లీ యూనివర్సిటీలోని శ్రీ రామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ నుండి కామర్స్‌లో బి.కామ్ ఆనర్స్ చేశారు. ఈ తరువాత ముంబైకి వెళ్లి ప్రింట్ మోడల్‌గా తన కెరీర్ ప్రారంభించింది. అలాగే.. నటనపై పలు నాటకాలల్లో నటించింది. అలాగే.. పలు టీవీ ప్రకటనలు కూడా నటించింది.
ఈ క్రేజ్ తో 'వన్ నైట్ విత్ ది కింగ్' (2006)లో అనే చిత్రంతో తన సినీ జీవితాన్ని ప్రారంభించింది నిమ్రత్ కౌర్. కానీ ఈ అమ్మడుకు అనుకున్న స్థాయిలో గుర్తింపు రాలేదు. దీంతో మళ్లీ యాడ్స్ వైపు వచ్చింది. 2013లో డైరీ మిల్క్ సిల్క్ ప్రకటన ద్వారా పాపులర్ అయ్యింది ఈ అమ్మడు. దీంతో 'ది లంచ్‌బాక్స్'లో నటించే అవకాశం వచ్చింది. ఈ మూవీలో ఇర్ఫాన్ నిమత్ర్ నటనకు మంచి గుర్తింపు వచ్చింది. ఈ మూవీని కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. ఈ తరువాత 2014లో నిమ్రత్ అమెరికన్ టీవీ సిరీస్ 'హోమ్‌ల్యాండ్'లో నటించింది. ఇక 2016లో అక్షయ్ కుమార్‌తో కలిసి 'ఎయిర్ లిఫ్ట్'లో కనిపించింది. 'ది టెస్ట్ కేస్','హోమ్‌ల్యాండ్' సిరీస్ లో నటించి మెప్పించింది.

అనంతరం బాలీవుడ్ నుండి మొదలుకొని అనేక అంతర్జాతీయ ప్రాజెక్ట్‌లలో పని చేసింది. 'ది లంచ్‌బాక్స్'తో పాటు 'ఎయిర్‌లిఫ్ట్', 'దస్వీ', 'సజ్ని షిండే కా వైరల్ వీడియో' వంటి హిట్ చిత్రాలలో నటించింది. అలాగే ఆమె 'హోమ్‌ల్యాండ్', 'వేవార్డ్ పైన్స్' వంటి అమెరికన్ సిరీస్‌లలో కూడా కనిపించింది. ఇక 2022లో అభిషేక్ బచ్చన్‌తో కలిసి ' దస్వీ' అనే మూవీలో నటించింది. ఈ మూవీ షూటింగ్ సమయంలో నిమ్రత్ కౌర్, అభిషేక్ బచ్చన్ మధ్య సాన్నిహిత్యం పెరిగిందని మీడియాలో వార్తలు వస్తున్నాయి.తాజాగా 'సెక్షన్ 84' అనే మూవీ కోసం సిద్దమవుతోంది. ఇందులో అమితాబ్ బచ్చన్ కూడా నటించారు.ఈ మూవీకి రిభు దాస్‌గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ అమ్మడుపై రూమార్స్ రావడం కొత్తేమి కాదు గతంలో టీమిండియా మాజీ క్రికెటర్ రవి శాస్త్రితో రిలేషన్ లో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. కాని ఇద్దరూ పుకార్లను కొట్టిపారేశారు. టాలీవుడ్ రానా దగ్గుబాటితో కూడా రిలేషన్ ఉన్నట్టు మరో పుకారు కూడా వచ్చింది. తాజాగా అభిషేక్ బచ్చన్‌తో ఈ అమ్మడు రిలేషన్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ అమ్మడు హిస్టరీ చూస్తే.. ఈ బ్యూటీ ఎక్కడ ఉంటే.. అక్కడ పుకార్లు షికార్లు చేస్తాయని కామెంట్స్ చేస్తున్నారు నెట్టిజన్లు.


Click it and Unblock the Notifications











