జూనియర్ శోభన ఆడియోన్స్ ను ఆకట్టుకొంటుందా...
ఇప్పటి వరకు అందరికి లవర్ బాయ్ గా తెలిసిన తనీష్‌ను తొలిసారిగా మాస్ హీరోగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు దర్శకుడు బీవీవీ చౌదరి. 'కోడిపుంజు" పేరుతో ఆయన దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రంలో తనీష్ సరసన శోభన నాయికగా నటిస్తున్నారు. డీఎస్ రావు సమర్పణలో శ్రీ శైలేంద్ర సినిమాస్ పతాకంపై ఎస్. బుజ్జిబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
సాధారణంగా ఎవరైనా కొత్త కథానాయిక సినీ పరిశ్రమలోకి ప్రవేశించగానే ఆమెలో ఏ హీరోయిన్ పోలికలు కనిపిస్తున్నాయని అందరూ ఆరాతీస్తుంటారు. ఆ మధ్య ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాతో పరిచయమైన స్నేహావుల్లాల్ ను చూసి జూనియర్ ఐశ్వర్య రాయ్ గా అభివర్ణించారు టాలీవుడ్ జనాలు. ఇప్పుడు తాజాగా అదే కోవలో కోడిపుంజు సినిమాతో పరిచయమవుతున్న కథానాయిక అంచల్ లో అందరూ ప్రముఖ నటి శోభన పోలికలు కనిపిస్తున్నాయని అంటున్నారు. ఇక ఈ విషయాన్ని క్యాష్ చేసుకుంటానని కోడిపుంజు చిత్ర దర్శక, నిర్మాతలు ఏకంగా అంచల్ పేరును శోభనగా మార్చేశారు. ఇక ఇప్పుడు అందరూ అంచల్ ను జూ శోభన అని పిలుస్తున్నారు. ఇక జూనియర్ శోభన ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











