twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్, షారుక్ రిజెక్ట్ చేసినా తగ్గలేదు.. మరో హీరోతో 300కోట్ల సినిమా సెట్ చేసుకున్న దర్శకుడు!

    |

    సాధారణంగా ఒక సినిమా సక్సెస్ అయితే ఆ దర్శకులకు వెంటనే స్టార్ హీరోల నుంచి పిలుపు రావడం కామన్. అలాంటి దర్శకుల కోసం స్టార్ హీరోలు నిత్యం తలుపులు తెరిచే ఉంచుతారు. అయితే ఏమైందో ఏమో గాని ఇటీవల వరుసగా బాక్సాఫీస్ హిట్స్ అందుకున్న ఒక కోలీవుడ్ దర్శకుడిని మాత్రం బయట హీరోలు రిజెక్ట్ చేస్తున్నారు. ఆ హీరోల లిస్ట్ లో షారుక్ ఖాన్ తో పాటు మన జూనియర్ ఎన్టీఆర్ కూడా ఉన్నాడు.

     స్టార్ డైరెక్టర్..

    స్టార్ డైరెక్టర్..

    కోలీవుడ్ దర్శకుడు అట్లీ అంటే అందరికి తెలిసే ఉంటుంది. ఈ దర్శకుడు చేసిన నాలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సాలీడ్ కలెక్షన్స్ అందుకున్నాయి. రాజా రాణా సినిమా సక్సెస్ అనంతరం కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో తెరి, మెర్సల్, బిగిల్ సినిమాలు చేసి సాలీడ్ హిట్స్ అందుకున్నాడు. ఒక్కో సినిమా పెట్టిన పెట్టుబడికి డబుల్, త్రిబుల్ ప్రాఫిట్స్ ని అందించాయి.

    రిజెక్ట్ చేసిన షారుక్

    రిజెక్ట్ చేసిన షారుక్

    ముఖ్యంగా బిగిల్ సినిమాతో అట్లీ సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా తన క్రేజ్ ని పెంచుకున్నాడు. ఆ సినిమా దాదాపు 350కోట్లకు పైగా వసూళ్లను అందుకుంది. దీంతో షారుక్ ని ఈజీగా కలుసుకున్న అట్లీ ఆయనతో ఒక సినిమా చేయాలని దాదాపు ఏడాది పాటు ప్రయత్నాలు చేశాడు. కానీ స్టోరీ నచ్చలేదని షారుక్ అతనిని రిజెక్ట్ చేశాడు.

    ఎన్టీఆర్ కూడా..

    ఎన్టీఆర్ కూడా..

    ఇక టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తో కూడా ఒక సినిమా చేయాలని అట్లీ గట్టిగానే ప్రయత్నాలు చేశాడు. దాదాపు స్టోరీ సిట్టింగ్ అయిపోగానే ఇద్దరు సినిమా చేయడానికి ఒక అభిప్రాయానికి వచ్చారని టాక్ వచ్చింది. కానీ ఎన్టీఆర్ కమర్షియల్ ఎలిమెంట్స్ మరీ ఎక్కువగా ఉన్నాయని అట్లీ కథను రిజెక్ట్ చేశాడట.

    Recommended Video

    RRR Update: NTR Komaram Bheem First Look Video On Sr NTR's Birthday
    మళ్ళీ అదే హీరోతో..

    మళ్ళీ అదే హీరోతో..

    బాలీవుడ్, టాలీవుడ్ లో మొదటి సారి ప్రయత్నాలు జరిపిన అట్లీ ఊహించని విధంగా చేదు అనుభవాలు ఎదుర్కోవడంతో మళ్ళీ సొంత గూటికి చేరి విజయ్ తోనే నాలుగవ సినిమాను తెరకెక్కించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దాదాపు 300కోట్ల భారీ బడ్జెట్ తో తన కొత్త సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం. మరి ఆ సినిమాతో అట్లీ ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి.

    English summary
    It’s been nearly one and a half year since hindi ShahRukh Khan’s Zero released and bombed at the box-office. Since then, SRK has not announced any new project even though he was rumored to be in talks with popular directors like Rajkumar Hirani,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X