Jr NTR తో అసురన్ డైరెక్టర్.. లైన్ లోకి మరో టాలెంటెడ్ హీరో.. రెండు భాగాలతో న్యూ ట్విస్ట్!
జూనియర్ ఎన్టీఆర్ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా వైరల్ అవుతోంది. రామ్ చరణ్ తో కలిసి నటించినా RRR సినిమాకు సంబంధించిన సాంగ్ కూడా ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్ లో నిలిచిన విషయం తెలిసిందే. రామ్ చరణ్ తో పాటు ఎన్టీఆర్ పేరు కూడా బాగా వైరల్ అవుతుంది. అయితే ఎన్టీఆర్ కు ఇప్పుడు అగ్ర దర్శకుల నుంచి కూడా భారీ ఆఫర్లు వస్తున్నాయి. ఇక మరో తమిళ దర్శకుడు కూడా ఎన్టీఆర్ పై ఫోకస్ చేశాడు. అయితే ఆ సినిమా రెండు భాగాలుగా రాబోతుండగా మరో తమిళ హీరో కూడా నటించబోతున్నాడు. ఆ వివరాలలోకి వెళితే..

ఎన్టీఆర్ బిగ్ లైనప్
జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయాలి అని చాలామంది ప్రముఖ దర్శకులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోంది అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. ఆ ప్రాజెక్టును మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో తీసుకురాబోతోంది.

తమిళ దర్శకుడి ప్రయత్నం
ఇక జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయాలి అని మరికొంతమంది ప్రముఖ దర్శకులు కూడా ఎదురు చూస్తున్నారు. ఇక అందులో తమిళ దర్శకులు కూడా ఉన్నారు. ముఖ్యంగా తమిళంలో అసురన్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్న దర్శకుడు వెట్రిమారన్ కూడా ఎన్టీఆర్ తో సినిమా చేయాలి అని చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇదివరకే వెట్రిమారన్ తో కొన్ని చర్చలు కూడా జరిగాయి.

మూడు కథలు చెబితే..
మొత్తంగా దర్శకుడు జూనియర్ ఎన్టీఆర్ కు మూడు కథలో గురించి చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే అందులో ఒక కథపై ఎన్టీఆర్ ఆసక్తిని చూపించి కొన్ని మార్పులు కూడా చేయమని చెప్పాడట. ఫైనల్ గా దర్శకుడు కథలో మార్పులు చేయగా ఎన్టీఆర్ కు బాగా నచ్చేసినట్లుగా తెలుస్తోంది. ఇక వీలైనంత త్వరగా ఆ ప్రాజెక్టు విషయంలో ఒక నిర్ణయానికి కూడా రావాలని అనుకుంటున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

రెండో బాగంలో ధనుష్
అయితే జూనియర్ ఎన్టీఆర్ కథను మార్చమని చెప్పినప్పుడు దర్శకుడు దానికి కొనసాగింపుగా మరొక కథను కూడా రెడీ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అంటే రెండు భాగాలుగా ప్రాజెక్టు ఉండబోతుందని సమాచారం. అయితే మరో కథలో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ పూర్తిస్థాయిలో ఉండకపోవచ్చు అని రెండో భాగంలో ధనుష్ హీరోగా కనిపించే అవకాశం ఉంటుంది అని తమిళ మీడియాలో కథనాలు వినబడుతున్నాయి.

పాన్ ఇండియా ప్లాన్
ధనుష్ తో దర్శకుడు వెట్రిమారన్ కు మంచి సాన్నిహిత్యం ఉంది. వీరి కాంబినేషన్లో ఇంతకు ముందుకు వచ్చిన అసురన్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ గా నిలిచింది. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ కు సరిపోయే కథలో కొనసాగింపుగా ధనుష్ కూడా ఉండే అవకాశం ఉందట. ఈ కథ గనక ఫైనల్ అయితే ధనుష్ కు కూడా తెలుగులో మంచి మైలేజ్ దొరుకుతుంది అని చెప్పవచ్చు. రెండు కూడా పాన్ ఇండియా ప్రాజెక్టులుగా తెరపైకి రానున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











