ధనుష్ మృణాల్ ఠాకూర్ డేటింగ్.. అప్పటి నుంచే డీప్ లవ్ లో కోలీవుడ్ స్టార్
కోలీవుడ్ స్టార్ ధనుష్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళ ఆడియెన్స్ తో పాటు తెలుగు ఆడియెన్స్ లో కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఇక ఆయన నటించే చిత్రాలకు కూడా ఇండియా వైడ్ గా భారీ రెస్పాన్స్ దక్కుతుంటుంది. బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాల్లోనూ కీలక పాత్రలతో ధనుష్ వరల్డ్ వైడ్ గా ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు. ఇక ధనుష్ కు సంబంధించిన ఎలాంటి వార్తైనా నెట్టింట క్షణాల్లోనే వైరల్ అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా ధనుష్ డేటింగ్ రూమర్లపై చర్చ కొనసాగుతోంది. ఆ వివరాల్లోకి వెళితే..
ధనుష్ డేటింగ్ రూమర్స్ ఎవరితో?
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ ను ధనుష్ తొలుత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 18 ఏళ్లు అన్యోన్యంగా జీవించిన వారు 2022లో విడిపోయారు. సెపరేషన్ ను ప్రకటించారు. ఇక 2024లో అధికారికంగా డివోర్స్ ను ప్రకటించారు. దాంతో కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో తీవ్రంగా చర్చ జరిగింది. ధనుష్ అభిమానులు షాక్ అయ్యారు. ఎందుకు వీరిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు అనేది ఇప్పటికీ రహస్యంగానే ఉండింది. ఇక పిల్లలకు మాత్రం కో పేరెంటింగ్ చేస్తున్నారు.

అయితే ఐశ్వర్య రాజేశ్ తో విడాకుల తర్వాత ధనుష్ సింగిల్ గానే తన లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. చెన్నైలో కొత్త ఇల్లును కూడా కట్టుకుని ఫ్యామిలీతో అక్కడే జీవిస్తున్నారు. ఇక డివోర్స్ తర్వాత కూడా ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ ను కలిపేందుకు రజనీకాంత్, కుటుంబ పెద్దలు ఎంతగానో ప్రయత్నించారని, కానీ వాళ్లిద్దరూ ఒప్పుకోలేదంట. ఇక రీసెంట్ గా వారి పెద్ద కుమారుడు యాత్ర రాజా స్కూల్ ఫంక్షన్ లో కలిశారు. ఇక ధనుష్ డివోర్స్ తర్వాత బాలీవుడ్ సెన్సేషనల్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ తో డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. వీరిద్దరూ కొన్నాళ్లుగా డీప్ లవ్ లో ఉన్నారని రూమర్లు పుట్టుకొచ్చాయి. అంతే కాదు రీసెంట్ గా ధనుష్ కు దగ్గరి వాళ్లు ఈ విషయాన్ని లీక్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ధనుష్ మృణాల్ వైరల్ వీడియో..
తమిళ చిత్రంలో స్టార్ హీరోగా ఎదిగిన ధనుష్, బాలీవుడ్ యంగ్ హీరోయిన్ ధనుష్ మృణాల్ కొంత కాలంగా డేటింగ్ లో ఉన్నారని క్లోజ్ ఫ్రెండ్ ఒకరు కోలీవుడ్ ఛానెల్ కు తెలిపినట్టు కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో రూమర్లు మొదలయ్యాయి. అదే విధంగా మృణాల్ ఠాకూర్ సినిమా ఫంక్షన్స్ లో గెస్ట్ లిస్ట్ లో ధనుష్ పేరు కూడా ఉండటం చర్చగా మారింది. మా, సన్ ఆఫ్ సర్దార్ వంటి చిత్రాల స్క్రీనింగ్ సమయంలో ధనుష్ కనిపించడం రూమర్లను బలపరిచాయి.
అలాగే వీరిద్దరూ చేతిలో చేయి వేసుకొని కనిపించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దాంతో మృణాల్ ఠాకూర్ ధనుష్ డేటింగ్ రూమర్లను వాస్తవమేనని అంటున్నారు. కానీ వారిద్దరూ తమ రిలేషన్ షిప్ ను అధికారికంగా వెల్లడించడానికి సిద్ధంగా లేరని తెలుస్తోంది. ఇక మున్ముందుపై ఈ డేటింగ్ రూమర్లపై ధనుష్, మృణాల్ ఠాకూర్ ఎలా స్పందిస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











