Pushpa 2: పుష్ప 2లో పాన్ ఇండియా స్టార్.. అల్లు అర్జున్‌కు హెల్ప్ చేసేందుకే!
టాలీవుడ్ నుంచి వచ్చే చిత్రాలకు దేశ వ్యాప్తంగా క్రేజ్ లభిస్తోంది. తద్వారా ఆయా సినిమాలు పాన్ ఇండియా రేంజ్‌లో సక్సెస్ అవుతున్నాయి. అలా వచ్చి దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరాభిమానాన్ని చూరగొన్న చిత్రమే 'పుష్ప ది రైజ్'. సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా కొన్ని వందల కోట్ల వసూళ్లను రాబట్టడంతో పాటు అల్లు అర్జున్‌ను నేషనల్ స్టార్‌ను చేసింది.
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో వచ్చిన 'పుష్ప ది రైజ్' మూవీ సూపర్ డూపర్ హిట్ అవడంతో ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా 'పుష్ప ది రూల్' మూవీని తెరకెక్కిస్తున్నారు. అదే కాంబినేషన్‌లో అత్యంత హై రేంజ్‌లో రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగానే దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.

'పుష్ప ది రూల్' మూవీకి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను చిత్ర యూనిట్ చాలా రోజుల క్రితమే మొదలు పెట్టేసింది. ఇలా ఇప్పటికే చాలా షెడ్యూళ్లను కంప్లీట్ చేసుకున్నారు. ఇప్పటి వరకూ దాదాపుగా 50 శాతానికి పైగానే చిత్రీకరణ కూడా పూర్తైందని తెలిసింది. మిగిలిన భాగాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసేలా సుకుమార్ ప్లాన్ చేసుకున్నాడు.
ఎర్రచందనం నేపథ్యంతో రాబోతున్న 'పుష్ప ది రూల్' మూవీలో ఫలానా స్టార్ హీరో కీలక పాత్రను చేస్తున్నాడని ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఎంతో మంది స్టార్లు పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. ఇక, తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో కోలీవుడ్‌లోని స్టార్ హీరో సూర్య కూడా నటిస్తున్నట్లు తెలిసింది. దీంతో ఈ న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న 'పుష్ప ది రూల్' మూవీలో పుష్పరాజ్ పాత్ర ఓ సందర్భంలో చిక్కుల్లో పడుతుందట. అప్పుడు అతడిని కాపాడేందుకు సూర్య రోల్ ఎంట్రీ ఇస్తుందని అంటున్నారు. అతడు కాసేపే కనిపించినా ఇంపాక్ట్ చూపించే విధంగా ఉంటాడని సమాచారం. ఈ వార్తపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ఇక, అల్లు అర్జున్ - సుకుమార్ కలయికలో వస్తున్న 'పుష్ప ది రూల్' మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా చేస్తోండగా.. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా నటిస్తున్నాడు. సునీల్, అనసూయ కీలక పాత్రలు చేస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.


Click it and Unblock the Notifications











