Don't Miss!
- Automobiles కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి వీడియో
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- News పురందేశ్వరికి చెక్ పెడుతోందెవరు - చంద్రబాబు ఎటువైపు..!?
- Sports `దాదా` మళ్లీ మొదలు పెట్టాడయ్యా: హీటెడ్ ఆర్గ్యుమెంట్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
తెలుగు దర్శకుడితో కోలీవుడ్ స్టార్ విజయ్..టాలీవుడ్ మార్కెట్ కోసం ఆ బడా నిర్మాతతో కలిసి..
టాలీవుడ్ మార్కెట్ లో కోలీవుడ్ స్టార్స్ సినిమాలు ఏ రేంజ్ లో వసూళ్లను అందుకుంటాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. రజనీకాంత్, కమల్, సూర్య , కార్తీ దాదాపు తెలుగు హీరోల మాదిరిగానే క్రేజ్ అందుకుంటున్నారు. ఇక ఆ లిస్టులో విజయ్ కూడా చేరిపోతున్నట్లు తెలుస్తోంది. త్వరలో డైరెక్ట్ గా తెలుగు దర్శకుడితో బిగ్ బడ్జెట్ సినిమాను చేయబోతున్నట్లు సమాచారం.
రజనీకాంత్ కంటే హై రేంజ్ లో
కోలీవుడ్ స్టార్ విజయ్ ఎలాంటి సినిమా చేసినా కూడా ప్రస్తుతం తమిళనాడులో భారీ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటున్నాయి. ఒక విధంగా మార్కెట్ పరంగా రజనీకాంత్ కంటే హై రేంజ్ లో సత్తా చాటుతున్నాడు. విజయ్ సినిమా విడుదలవుతోంది అంటే పోటీగా మరే సినిమా కూడా రావడం లేదు.
మాస్టర్ బాక్సాఫీస్ హిట్
ఇక ఈ స్టార్ హీరో తెలుగు మార్కెట్ పై కూడా స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. మెర్సల్ నుంచి కూడా విజయ్ ప్రతి సినిమా తెలుగులో అనువాదం అవుతోంది. అలాగే కలెక్షన్స్ కూడా బాగానే అందుకుంటున్నాడు. ఇక రీసెంట్ గా వచ్చిన మాస్టర్ సినిమా పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలను అందించింది.
దిల్ రాజుతో చేతులు కలిపిన విజయ్
రానున్న రోజుల్లో విజయ్ నుంచి మరిన్ని సినిమాలు తెలుగులో భారీ స్థాయిలో విడుదల కాబోతున్నట్లు టాక్ వస్తోంది. ఇక ఈసారి ఏకంగా దిల్ రాజుతో చేతులు కలిపినట్లు సమాచారం. విజయ్ కు అలాగే దిల్ రాజుకు మంచి సాన్నిహిత్యం ఉంది. ఆ హీరో డబ్ సినిమాలు చాలా వరకు దిల్ రాజు సపోర్ట్ తోనే తెలుగులో భారీగా విడుదలయ్యాయి.
Recommended Video
దర్శకుడిగా వంశీ పైడిపల్లి
ఇక దిల్ రాజు విజయ్ మధ్యన ఒక ఒప్పందం కుదిరినట్లు సమాచారం. తెలుగు, తమిళ్ లో ఒక ద్విభాషా సినిమా చేయాలని అనుకుంటున్నారట. ఇక వంశీ పైడిపల్లిని దర్శకుడిగా సెలెక్ట్ చేసినట్లు సమాచారం. స్టోరీ లైన్ పై కూడా విజయ్ పాజిటివ్ గా స్పందించినట్లు సమాచారం. ఇదివరకే వంశీ ఊపిరి సినిమాను తమిళ్ లో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక ఆ అనుభవంతోనే దిల్ రాజు అతన్ని సెలెక్ట్ చేసినట్లు సమాచారం.