మోక్షజ్ఞ సినిమాలో విలన్ గా అర్జున్ రెడ్డి రీమేక్ హీరో!
Nandamuri Mokshagna: గాడ్ ఆఫ్ మాసేస్, నటసింహ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఇవ్వనున్న విషయం తెలిసిందే. యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నందమూరి హీరో మోక్షజ్ఞ తొలి సినిమా రాబోతుంది. ఇప్పటికే పలు ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇస్తూ సినిమాపై హైప్స్ క్రియేట్ చేస్తున్నారు. తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది. ఇంతకీ ఆ వైరల్ న్యూస్ ఏంటి?
నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు యంగ్ డైరెక్టర్ హనుమాన్ ఫ్రేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. తేజస్విని సమర్పణలో ఎస్ఎల్ సినిమా బ్యానర్ పై సుధాకర్ చేకూరి మోక్షజ్ఞ తొలి సినిమాను నిర్మిస్తున్నారు. మైథాలజికల్ యాక్షన్ ఇంటర్నేషనల్ గా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు మూవీ మేకర్స్ చెబుతున్నారు. ఈ మూవీలో బాలకృష్ణ శ్రీకృష్ణుని పాత్రలో నటించబోతున్నారని ప్రచారం జరుగుతుంది. అయితే ఈ ప్రచారంపై మూవీ మేకర్స్ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

అయితే తాజాగా మరో క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మోక్షజ్ఞ మొదటి సినిమాలో విలన్ గా.. కోలీవుడ్ స్టార్ విక్రమ్ హీరో (Kollywood star Vikram) తనయుడు ద్రువ్ (Dhruv) నటించబోతున్నారని తెలుస్తుంది. ఈ క్యారెక్టర్ కోసం ద్రవును మూవీ టీం సంప్రదించగా.. ప్రశాంత్ వర్మ కథ నచ్చి మూవీలో నటించడానికి ధ్రువ్ ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ విషయంపై త్వరలోనే మూవీ మేకర్స్ అధికారిక ప్రకటన చేయబోతున్నట్లు తెలుస్తోంది.
'అర్జున్ రెడ్డి' రీమేక్ గా తెరకెక్కిన'ఆదిత్య వర్మ' అనే సినిమాతో స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధ్రువ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తొలి సినిమాలోని తన గట్స్ యాక్టింగ్ తో తమిళ ప్రేక్షకులను మెప్పించాడు.ఆ తర్వాత తన తండ్రితో కలిసి 'మహాన్' అనే మూవీలో నటించారు. ఈ మూవీతో దృవ్ కు మంచి గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం బైసన్ అనే సినిమాలో నటిస్తున్నారు. తాజాగా బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ డెబ్యూ మూవీలో విధంగా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇలా ఒకే సినిమాలో ఇద్దరు స్టార్ హీరోల తనయులు నటించడం విశేషం. అది కూడా ఒకరు విలన్ గా మరొకరు హీరోగా నడుస్తున్నారనేది ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











