Don't Miss!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్‌కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- News వివేకా కేసులో మరో అనూహ్య ట్విస్ట్- విచారణ నుంచి తప్పుకున్న జడ్జి..!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
కోలీవుడ్‌లో రగులుతున్న మల్టీస్టారర్ సెగలు.. RRRని కొట్టేలా బడా కాంబినేషన్స్?
స్టార్ హీరోలను ఒకే ఫ్రేమ్‌లో చూడాలని అభిమానుల్లో చాలా కోరికలు ఉంటాయి. దర్శకులు కూడా బడా హీరోలను ఒకేసారి డైరెక్ట్ చేయాలని మనసులో అనుకుంటూ ఉంటారు. కానీ దర్శకుల్లో ఆ కోరిక కంటే ఎక్కువ భయం ఉంటుంది. అందుకు కారణం అభిమానులు. ఎందుకంటే తమ హీరోను వేరే హీరో కన్నా తక్కువగా చూపిస్తే తట్టుకోలేరు. అందుకే దర్శకుల్లో ఆ భయం ఎక్కువగా ఉంటుంది.
Recommended Video
మల్టీస్టారర్ మాయ..
ఒక దశలో ఇటు తెలుగు, అటు తమిళ్ లో మల్టీస్టారర్ సినిమాలు ఒక రేంజ్ లో వచ్చాయి. క్రమక్రమంగా అలాంటి సినిమాలు తగ్గుతూ వచ్చాయి. ఇక చాలా కాలం తరువాత సౌత్ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ మాయ మొదలైంది. RRRతో జక్కన్న అందరిని ఎట్రాక్ట్ చేసాడు. దీంతో మిగతా ఇండస్ట్రీలో కూడా పాన్ ఇండియా కాన్సెప్ట్ ని జోడించి మల్టీస్టారర్ సినిమా చేయాలని అనుకుంటున్నారు.
కోలీవుడ్‌లో మల్టీస్టారర్ సెగలు..
తమిళ చిత్ర పరిశ్రమలో అభిమానుల మధ్య యుద్ధాలు ఒక రేంజ్ లో ఉంటాయి. అందుకే అక్కడి సినీ తారలు మిగతా హీరోల గురించి ఎక్కువగా మాట్లాడరు. ఇక ఇప్పుడు కోలీవుడ్‌లో మల్టీస్టారర్ సెగలు మొదలైనట్లు తెలుస్తోంది. RRR కారణంగా అక్కడి స్టార్ డైరెక్టర్స్ తమిళ్ హీరోలను ఒకటి చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మణిరత్నం విక్రమ్, కార్తీ వంటి వారితో పొన్నియిన్ సెల్వన్ అనే ప్రాజెక్టును స్టార్ట్ చేశాడు.
విజయ్ - అజిత్ కాంబినేషన్..
తమిళ్ చిత్ర పరిశ్రమలో ఇటీవల కాలంలో విజయ్ - అజిత్ కాంబినేషన్ పై వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. వీరికి లోకల్ గా రజినీకాంత్ స్థాయిలో మార్కెట్ ఉంది. విజయ్ అయితే ఈ మధ్య తెలుగు ఆడియెన్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ అందుకుంటున్నారు. అయితే ఈ కాంబినేషన్ లో ఒక బిగెస్ట్ మల్టీస్టారర్ ని ప్లాన్ చేయాలని చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని గతంలో ఒక సీనియర్ దర్శకుడు ఈ ఇద్దరి హీరోలను కలపడానికి ప్రయత్నం చేశారు. విజయ్,అజిత్ సానుకూలంగా స్పందించినప్పటికి ఎందుకో వర్కౌట్ కాలేదు.
కమల్, రజినీలకు సెట్టయ్యేలా లేదు..
రజినీకాంత్ , కమల్ హసన్ కలిసి సినిమా చేయాలని చాలా కాలంగా అనుకుంటున్నారు. కానీ వారికి సరైన కథ దొరకడం లేదు. ఇక ప్రస్తుత కాలంలో పాలిటిక్స్ తో బిజీ కావడంతో ఈ కాంబినేషన్ సెట్టయ్యేలా కనిపించడం లేదు. ఇక సూర్య, కార్తీ కూడా ఒక సినిమా చేయాలని చాలా రోజులుగా అనుకుంటున్నారు. గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో కార్తీ ఒక కాన్సెప్ట్ పై చర్చలు జరుపుతున్నట్లు చెప్పాడు. వచ్చే ఏడాది ఈ కాంబోపై ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందని కోలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.