కోలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడితో ఎన్టీఆర్ చర్చలు.. అది నిజం కాదు, కానీ..

ప్రస్తుతం ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా సరే అగ్ర హీరోలు భాషతో సంబంధం లేకుండా దర్శకులతో సినిమాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. టాలెంట్ ఉన్న దర్శకులకు ఈ రోజుల్లో డిమాండ్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. భారీస్థాయిలో రెమ్యునరేషన్స్ కూడా ఆఫర్ చేస్తూ.. హీరోలే వారి సొంత ప్రొడక్షన్ లో కూడా సినిమాను చేసే అవకాశం ఇస్తున్నారు. ఇక నిర్మాతల నుంచి కూడా వారికి ఎక్కువగానే ఆఫర్లు వస్తున్నాయి. కొత్త కాంబినేషన్ తెరపైకి వస్తే మార్కెట్ స్థాయి కూడా ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ తో సినిమాలు చేయాలని ఇతర ఇండస్ట్రీలో కొంత మంది అగ్ర దర్శకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు అని చెప్పవచ్చు.

జూనియర్ పాన్ ఇండియా మార్కెట్ వాల్యూ మరో స్థాయికి వెళ్లడం ఖాయమని ఇదివరకే ఒక క్లారిటీ వచ్చేసింది. ఎందుకంటే RRR తర్వాత సినిమాలు కూడా అలానే ఉండాలని గట్టిగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమాను మొదలుపెట్టడానికి రెడీగా ఉన్న విషయం తెలిసిందే. కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో కూడా ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా అనంతరం ఎన్టీఆర్ ఎవరితో వర్క్ చేస్తాడు అనేది కాస్త సస్పెన్స్ క్రియేట్ చేస్తోంది. అసలైతే ఆ సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని అనుకున్నాడు. ఆ ప్రాజెక్టు స్క్రిప్ట్ కూడా పూర్తయ్యింది కానీ కానీ జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా మార్కెట్ వైపు యూ టర్న్ తీసుకోవడంతో వెనుకడుగు వేయాల్సి వచ్చింది.

Kollywood talented planing for ntr new project latest updates

త్రివిక్రమ్ లోకల్ కథను ఎప్పుడైనా చేయవచ్చు అని తను మనసు మార్చుకున్నాడు. ఇక నెక్స్ట్ ఒక తమిళ డైరెక్టర్ వెట్రిమారన్ కూడా జూనియర్ ఎన్టీఆర్ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నట్లు టాక్ అయితే వస్తుంది. ఇటీవల ఈ దర్శకుడు అసురన్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అయితే గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ విషయంపై ఎవరు కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఎన్టీఆర్ సన్నిహితుల నుంచి అందిన సమాచారం ప్రకారం ఇప్పటివరకు ఈ తమిళ దర్శకుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ కలవలేదని అంటున్నారు. నిజానికి వీరి కలయిక ఇంకా ఒక్కసారి కూడా జరగలేదని తెలుస్తుంది. కానీ తమిళ దర్శకులు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయాలనే ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది.

గతంలో అట్లీ కూడా ఎన్టీఆర్ తో సినిమా చేయాలని ప్రయత్నాలు చేశాడు కానీ వర్కౌట్ కాలేదు. ఇక ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తన ఫోకస్ మొత్తం కొరటాల శివ ప్రాజెక్టు పైన పెట్టబోతున్నాడు. ఆ సినిమా కథ కూడా దాదాపు ఫినిష్ అయ్యింది. లాక్ డౌన్ లోనే దర్శకుడు కొరటాల ప్రీ ప్రొడక్షన్ ప్లాన్ ను కూడా సిద్ధం చేసుకున్నాడు. కాబట్టి సినిమా ఎప్పుడైనా కూడా సెట్స్ పైకి రావచ్చని తెలుస్తోంది. సినిమా షూటింగ్ మొదలు పెట్టిన తర్వాత పెద్దగా గ్యాప్ ఇవ్వకుండా ఒక నాలుగైదు నెలల్లోనే షూటింగ్ ఫినిష్ చేయాలని అనుకుంటున్నారు. అనంతరం సలార్ విడుదల అనంతరం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో పాన్ ఇండియా ప్రాజెక్టును స్టార్ట్ చేయనున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X