పవన్ కళ్యాణ్ ధ్రోట్ ఇన్పెక్షన్ తో డబ్బింగ్ లేటయ్యి...
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పవన్ కళ్యాణ్ తాజా చిత్రం 'కొమురం పులి' చిత్రం ఆగస్టు 18న రిలీజ్ కానుంది. ఈ మేరకు నిర్మాతలు ఏర్పుట్లు చేస్తున్నట్లు సమాచారం. మొదట ఈ చిత్రాన్ని ఆగస్టు 11 రిలీజ్ చేద్దామని నిర్మాత నిర్ణయించుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ కి జలుబుతో కూడిన ధ్రోట్ ఇన్పెక్షన్ రావటంతో డబ్బింగ్ లేటయింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పూర్తి ఉత్సాహంతో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని పూర్తి చేసేందుకు సహకరిస్తున్నారు. ఇక నిఖిషా పటేల్ హీరోయిన్ గా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని ఖుషి పేమ్ ఎస్.జె.సూర్య డైరక్ట్ చేసారు. కనకరత్న మూవీస్ బ్యానర్ పై శింగనమల రమేష్ నిర్మించే ఈ చిత్రంలో శ్రియ ఓ ఐటం సాంగ్ చేస్తోంది. జల్సా రిలీజై చాలా కాలం అవటంతో ఈ చిత్రం కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇక ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు.
పవన్ కళ్యాణ్ పులి నిఖిషా పటేల్ ఎస్ జె సూర్య ఖుషీ శ్రియ pawan kalyan puli nikisha patel sj surya kushi shriya


Click it and Unblock the Notifications