కోన వెంకట్ కన్ను...రవితేజపై పడింది!
హైదరాబాద్: టాలీవుడ్ పాపులర్ రచయితల్లో ఒకరైన కోన వెంకట్....దర్శకుడిగా తన టాలెంట్ ఏమిటో నిరూపించుకోవాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. శ్రీను వైట్ల ఆస్థాన రచయితగా పేరుగాంచిన కోన వెంకట్ ఆ మధ్య ‘బాద్ షా' చిత్రం సమయంలో శ్రీను వైట్లతో విబేధించాడు.

ఇకపై శ్రీను వైట్లతో పని చేయను...దర్శకత్వం వైపు అడుగులు వేస్తున్నానంటూ ప్రకటించిన కోన వెంకట్ ఇప్పటి వరకు మెగా ఫోన్ పట్టుకోలేదు. బాద్ షా తర్వాత....ఓ అరడజను సినిమాలకు రచయితగా పని చేసారు. ఇటీవల వచ్చిన పవర్, గీతాంజలి లాంటి హిట్ చిత్రాలు అందులో ఉన్నాయి.
ఆ మధ్య పవన్ కళ్యాణ్....కోన వెంకట్‌కు అవకాశం ఇచ్చారనే వార్తలు వినిపించినప్పటికీ అవి వార్తలుగానే మిగిలిపోయాయి. తీస్తే గీస్తే పెద్ద హీరోలతోనే తీసి హిట్ కొట్టాలనే కసితో ఉన్న కోన వెంకట్ చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. తాజాగా కోన వెంకట్‌కు రవితేజ ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల రవితేజకు స్టోరీ లైన్ వినిపించిన కోన వెంకట్ అతని నుండి గ్రీన్ సిగ్నల్ తీసుకున్నారని తెలుస్తోంది. 2015లో ఈచిత్రం మొదలయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











