‘బాద్ షా’ యూఎస్ రైట్స్‌పై కోన వెంకట్ కన్ను
తాజాగా అందిన ఆసక్తికర సమచారం ఏమిటంటే...ఈచిత్రం యూఎస్ రైట్స్ దక్కించుకునేందుకు ఈ చిత్రానికి రచయితగా పని చేస్తున్న కోన వెంకట్ ట్రై చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా స్వయంగా వెల్లడించారు. ''బాద్ షా యూఎస్ రైట్స్ కావాలని నిర్మాత బండ్ల గణేష్ ను అడిగా, రేటు పెద్ద మ్యాటర్ కాదు...ఆయన నుంచి పాజిటివ్ రిప్లై వస్తుందని ఆశిస్తున్నా...' అంటూ ట్వీట్ చేసారు. మరి కోన కోరిక తీరుతుందో? లేదో? చూడాలి.
శివబాబు బండ్ల సమర్పణలో పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీనువైట్ల దర్శకత్వంలో బండ్ల గణేష్ నిర్మిస్తున్న భారీ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. డిసెంబర్ కల్లా షూటింగ్ పార్టు పూర్తి చేసుకుని పోస్టు ప్రొడక్షన్ పనులు మొదలు కానున్నాయి. అదే నెలలో ఆడియో విడుదల కానుంది.
ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా, గోపీ మోహన్, కోన వెంకట్ స్క్రిప్టు రచయితులగా పని చేస్తున్నారు. ఎ.ఎస్.ప్రకాష్, ఎం.ఆర్.వర్మ, చలసాని రామారావు ఇతర సాంకేతిక నిపుణులుగా పని చేస్తున్నారు. ఈ చిత్రానికి సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీను వైట్ల.


Click it and Unblock the Notifications












