నాగబాబుకు ఊహించని పదవి.. మెగా బ్రదర్ బంపర్ ఆఫర్...!

మెగా బ్రదర్,నటుడు,జనసేన అధినేత నాగబాబును ఏపీలో కీలక పదవి వరించబోతున్నదనే విషయం మీడియాలో వైరల్ అవుతున్నది. తాజాగా ఆయన ఏపీలో లోక్‌సభకు పోటీ చేయాలని నిర్ణయించుకొన్నప్పటికీ.. చివరి నిమిషంలో పొత్తు ధర్మాన్ని పాటించి ఆయన బరిలో నుంచి తప్పుకోవడం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించిన తర్వాత మెగా బ్రదర్‌కు అత్యున్నత పదవిని కట్టబెట్టే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఈ వివరాల్లోకి వెళితే..

నాగబాబు రాజకీయ ప్రస్థానం విషయానికి వస్తే.. గతంలో ప్రజారాజ్యం పార్టీ నుంచి అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేసి దారుణమైన ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన నుంచి కూడా ఎంపిగా పోటీ చేసి ఓడిపోయారు.అయినప్పటికీ ఆయన క్రీయాశీలక రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు.

Konidela Nagababu is reported to be the new chairman of Tirumala Tirupati Devasthanam TTD goes viral

అయితే 2024 ఎన్నికల్లో కూడా ఎంపీగా పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు. ఆయన తన నియోజకవర్గాన్ని కూడా ఎంచుకొని ముందే ప్రచారం, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. కానీ టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ధర్మాన్ని పాటించి.. తన సీటును బీజేపీకి త్యాగం చేశారు. దాంతో ఈ సారి ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు.

ఇక తాజా ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కల్యాణ్‌ కోసం వ్యూహాన్ని రచించారు. కార్యకర్తలు, అభిమానులు, నేతలతో కలిసి భారీగా ప్రచారం నిర్వహించారు. ఆయన కృషి, నేతల పట్టుదల వల్ల పిఠాపురంలో రికార్డు మెజారిటీ పవన్ కల్యాణ్‌ పేరిట నమోదైంది.

ఇది ఇలా ఉంటే.. కూటమి తరపున కీలక బాధ్యతలు వహించి పార్టీల విజయానికి కృషి చేసిన నాగబాబుకు త్వరలోనే ఎవరూ ఊహించని పదవి దక్కబోతున్నది. తాజా సమాచారం ప్రకారం.. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బాధ్యతలు కట్టబెడుతున్నట్టు సమాచారం. ఈ పదవి బాధ్యతల అప్పగింతపై అధికారికంగా ఉత్తర్వులు వెలువడుతాయని ప్రచారం జరుగుతున్నది.

ఇది ఇలా ఉండగా.. తిరుపతిలో గత ఐదేండ్లలో జరిగిన అక్రమాలు, టీటీడీలో జరిగిన అవినీతి గురించి జనసేన కార్యకర్తలు ఫిర్యాదులు చేస్తున్నారు. టీటీడీ ఈవోపై ఫిర్యాదు చేసి విదేశాలకు పారిపోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరమైతే లుకౌట్ నోటీసులు జారీ చేయాలని సూచించారు.

More from Filmibeat

Read more about: naga babu ttd pawan kalyan janasena
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X