Devara: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. దేవర మూవీ నుంచి ఆ సీన్స్ అన్నీ కట్!
యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్స్ ఇలా అన్ని విభాగాల్లోనూ తనదైన ముద్రను వేసుకుంటూ చాలా కాలంగా తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ హీరోగా దూసుకుపోతోన్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. దీనికితోడు 'టెంపర్' నుంచి మొదలుకొని వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతోన్న అతడు.. ఇదే ఊపును కంటిన్యూ చేయాలన్న లక్ష్యంతో 'దేవర' (Devara) మూవీ చేశాడు.
టాలీవుడ్ బడా డైరెక్టర్ కొరటాల శివతో జూనియర్ ఎన్టీఆర్ చేసిన సినిమానే 'దేవర'. గతంలో భారీ హిట్ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్‌లో రూపొందిన ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే దీన్ని కోస్టల్ ఏరియా బ్యాగ్‌డ్రాప్‌తో హై రేంజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తీసుకు వచ్చారు. ఫలితంగా దీనిపై వరల్డ్ వైడ్‌గా హైప్ ఏర్పడిందని చెప్పొచ్చు.

సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌లో రూపొందిన 'దేవర' మూవీ సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ సినిమా మొత్తంలో జూనియర్ ఎన్టీఆర్ 'వన్ మ్యాన్ షో' చేశాడు అని అభిప్రాయాలు వచ్చాయి. అలాగే, రివ్యూలూ డీసెంట్‌గా వచ్చాయి. దీంతో మొదటి రోజు అన్ని చోట్లా ఈ చిత్రానికి మంచి స్పందన వస్తోంది. దీంతో థియేటర్లు మొత్తం కళకళలాడుతున్నాయి.
'దేవర' మూవీ ఆద్యంతం మాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకునే ఫుల్ లెంగ్త్ కమర్షియల్ జోనర్‌లో రూపొందింది. అలాగే, ఇందులో అన్ని వర్గాల వాళ్లకూ నచ్చే అంశాలు చాలా ఉన్నాయి. అయితే, ఈ సినిమా లెంగ్త్ (నిడివి) ఎక్కువగా ఉందని ఆరంభం నుంచీ విమర్శలు వస్తున్నాయి. దీంతో ఈ విషయంపై ఫోకస్ చేసిన కొరటాల శివ ముందుగానే ఓ మంచి పని చేసినట్లు తెలిసింది.

క్రేజీ కాంబోలో రూపొందిన 'దేవర' సినిమాకు సంబంధించిన లెంగ్త్‌ను తెలుగులో కాస్త తగ్గించారు. ముఖ్యంగా ఓ పాటను తొలగించేశారు. అదే సమయంలో హిందీ వెర్షన్‌లో చాలా భాగాన్ని ట్రిమ్ చేసినట్లు తెలిసింది. మరీ ముఖ్యంగా తెలుగు నటీనటులు ఉన్న కొన్ని సాధారణమైన సన్నివేశాలను కత్తిరించే హిందీలో దీన్ని ప్రదర్శన చేస్తున్నారని అంటున్నారు. ఇది ఉత్తరాదిలో సినిమాకు కాస్త ప్లస్ అయ్యే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ఇదిలా ఉండగా.. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కించిన 'దేవర' మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. దీనికి అనిరుథ్ సంగీతం అందించాడు. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటించాడు. ఇందులో శ్రీకాంత్, చాకో, మురళీ శర్మ, అజయ్‌లు కీలక పాత్రలను పోషించారు.


Click it and Unblock the Notifications











