ఒకేసారి ఇచ్చేసిన రాంచరణ్.. శ్రీమంతుడు తరువాత మిస్సవ్వకూడదని!
Recommended Video

మెగా పవర్ స్టార్ రాంచరణ్ క్రేజీ చిత్రాలతో దూసుకుపోతున్నాడు. రంగస్థలం చిత్రంతో భారీ విజయం సొంతం చేసుకున్న చరణ్ ప్రస్తుతం బోయపాటి దర్శత్వంలో మాస్ ఎంటర్ టైనర్ చిత్రం వినయ విధేయ రామ చిత్రంలో నటిస్తున్నాడు. మరోవైపు రాజమౌళి ఆర్ఆర్ఆర్ కూడా ప్రారంభమైపోయింది. ఇదిలా ఉండగా చరణ్ మెగాస్టార్ చిరంజీవి చిత్రాలకు నిర్మాతగా వ్యవహరిస్తూ దూసుకుపోతున్నాడు. కొరటాల దర్శత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించాల్సి ఉంది. రాంచరణ్ తో కూడా ఓ చిత్రం ఉండబోతోందనే క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది.

శ్రీమంతుడు తరువాత
సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన శ్రీమంతుడు చిత్రం కోసం కొరటాల మొదట రాంచరణ్ నే సంప్రదించినట్లు వార్తలు ఉన్నాయి. ఆ సమయంలో వీరి కాంబినేషన్ మిస్ అయింది. శ్రీమంతుడు తరువాత కొన్ని ఇంటర్వ్యూలలో కొరటాల మాట్లాడుతూ అతి త్వరలో అద్భుతమైన కథ సిద్ధం చేసి రామ్ చరణ్ తో సినిమా చేస్తానని కొరటాల అన్నారు.

రాంచరణ్ బిజీ బిజీ
కానీ అటు కొరటాల శివ, ఇటు రాంచరణ్ వారి చిత్రాలతో బిజీగా మారిపోవడంతో ఈ కాంబినేషన్ మరింత ఆలస్యం జరిగింది. ఈ లోపు కొరటాల మెగాస్టార్ చిరు కోసం కథ సిద్ధం చేసి సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రానికి కూడా రాంచరణే నిర్మాత అని ప్రచారం జరుగుతోంది. రాంచరణ్ ఆర్ఆర్ఆర్ చిత్రం తరువాత కొరటాల దర్శత్వంలో నటిస్తాడని వార్తలు వస్తున్నాయి.

ముందుగానే అడ్వాన్స్
తన చిత్రానికి, మెగాస్టార్ చిరంజీవి నటించే రెండు చిత్రాలకు రాంచరణ్ ముందుగానే కొరటాలకు అడ్వాన్స్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. తిరుగులేని విజయాలతో దూసుకుపోతున్న కొరటాల శివ దర్శత్వంలో నటించాలని రాంచరణ్ ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. జరుగుతున్న ప్రచారం బట్టి కొరటాల రెండు చిత్రాలు మెగా హీరోలతో అని అర్థం అవుతోంది.

రైతు కథాంశం
కొరటాల, చిరంజీవి చిత్రం జనవరి నుంచి ప్రారంభం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో రైతు పాత్రలో మెగాస్టార్ కనిపిస్తాడట. కొరటాల శివ తనదైన శైలిలో కమర్షియల్ అంశాలతో సందేశాత్మక కథని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం కోసం పలువురు సీనియర్ హీరోయిన్ల పేర్లు వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











