»   » మహేష్ మూవీ: కొరటాల సొంత కథ కాదా? రూ. కోటి ఇచ్చి కొన్నాడా?

మహేష్ మూవీ: కొరటాల సొంత కథ కాదా? రూ. కోటి ఇచ్చి కొన్నాడా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'శ్రీమంతుడు' లాంటి భారీ చిత్రం తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు, బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో మరో చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈచిత్రం అఫీషియల్ గా లాంచ్ అయింది.

ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ చిత్రానికి 'భరత్ అనే నేను' టైటిల్ పెట్టే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న డివివి ఎంటర్టెన్మెంట్స్ వారు ఈ టైటిల్ రిజిస్టర్ చేయించడంతో ఇదే టైటిల్ తో సినిమా వస్తుందని భావిస్తున్నారు. అయితే అఫీషియల్ గా ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు.

ఆ సంగతి పక్కన పెడితే... ఈ సినిమా విషయంలో దర్శకుడు కొరటాల శివపై షాకింగ్ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కథ కొరటాల సొంత కథ కాదని... వేరే రైటర్ దగ్గర కొన్నారనే ప్రచారం జరుగుతోంది.

రూ. కోటి ఇచ్చి కథ కొన్నారా?

రూ. కోటి ఇచ్చి కథ కొన్నారా?

కొరటాల శివ స్వతహాగా మంచి రైటర్, మాటల రచయిత కూడా. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. ‘భరత్ అనే నేను' కథ కొరటాలకు బాగా నచ్చిందని, అందుకే దాన్ని కొన్నాడని, ఈ కథకు తనదైన డైలాగులు, స్క్రీన్ ప్లే జోడించి మహేష్ బాబు కోసం ప్రిపేర్ చేసాడని టాక్.

ఎవరి వద్ద కొన్నారు?

ఎవరి వద్ద కొన్నారు?

శ్రీహరి నాను అనే రైటర్ వద్ద ఈ కథ కొన్నట్లు ప్రచారం జరుగుతోంది. కొరటాలకు అతడు బాగా పరిచయమే.... ఆయన దగ్గరున్న ఈ కథ నచ్చడంతో భారీ ఆఫర్ ఇచ్చి కథను కొనేసాడట. మరి ఈ ప్రచారంలో నిజం ఎంతో తేలాల్సి ఉంది.

ఎవరీ శ్రీహరి నాను

ఎవరీ శ్రీహరి నాను

శ్రీహరి నాను పెద్దగా పేరు లేని రచయిత, దర్శకుడు. గతంలో ‘తకిట తకిట' అనే సినిమా చేసాడు. ఈ సినిమాను హీరోయిన్ భూమిక నిర్మించింది. హర్షవర్థన్ రానే, హరిప్రియ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈచిత్రం అప్పట్లో రిలీజైంది.

సినిమా ఎప్పుడు రిలీజ్?

సినిమా ఎప్పుడు రిలీజ్?

ఫిబ్రవరిలో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టి ఆరు నెలల్లో ఈ చిత్రాన్ని పూర్తి చేయాలని ప్రణాళిక వేసుకున్నారు. అంతా అనుకున్నట్లుగా జరిగితే సెప్టెంబరు 22న ఈ సినిమా విడుదలవుతుంది.

షాక్ అయ్యే విషయాలు: మహేష్ బాబు భార్య గురించి మీకు తెలియనివి..

షాక్ అయ్యే విషయాలు: మహేష్ బాబు భార్య గురించి మీకు తెలియనివి..

షాక్ అయ్యే విషయాలు: మహేష్ బాబు భార్య గురించి మీకు తెలియనివి..(ఫోటోలు, వివరాల కోసం క్లిక్ చేయండి)

ఈసారి ప్రిన్స్ దెబ్బకి అందరికీ మైండ్ బ్లాకే..!

ఈసారి ప్రిన్స్ దెబ్బకి అందరికీ మైండ్ బ్లాకే..!

ఈసారి ప్రిన్స్ దెబ్బకి అందరికీ మైండ్ బ్లాకే..!.... (పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి)

English summary
Mahesh Babu’s 24th film titled Bharath Anu Nenu in Koratala Siva direction is reason for biggest joy in his fans circles. Most importantly, He is playing Chief Minister in the political thriller which will begin shoot from February next year. Film Nagar source said that, story and script from an infamous writer, director Sreehari Nanu paying him one time settlement Rs.1 Crore amount.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu