ఆ పాత్రలో ఎన్టీఆర్.. కొరటాల ప్లానింగ్ మామూలుగా లేదు.. అలా కూడా వాడేస్తారా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈరోజు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడించారు. ఎలాంటి ఇబ్బంది లేదని ప్రస్తుతానికి బాగానే ఉన్నానని నాతో పాటు కుటుంబమంతా ఐసోలేషన్ లోనే ఉన్నాము అని ఆయన చెప్పుకొచ్చారు.. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటే ఉన్నామని గత కొద్ది రోజులుగా తనతో కాంటాక్ట్ అయిన వారు అందరూ దయచేసి టెస్టులు చేయించుకోవాలని ఎన్టీఆర్ కోరారు. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొరటాల శివతో ఓ సినిమా చేస్తున్నారు. ఆ సినిమాకి సంబంధించి ఒక ఆస్తికరమైన ప్రచారం వెలుగులోకి వచ్చింది. ఆ విషయం లోకి వెళితే
Recommended Video

చివరిగా త్రివిక్రమ్ తో
చివరిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో అరవింద సమేత వీర రాఘవ సినిమా చేసిన ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మక సినిమా ఆయన ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తున్నారు.. ఈ సినిమాలో ఆయన రామ్ చరణ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమురంభీం పాత్రలో నటిస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు. భారీ బడ్జెట్ సినిమా కావడంతో పాటు రాజమౌళి-ఎన్టీఆర్-రామ్ చరణ్ కాంబో కావడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి.

అనూహ్యంగా కొరటాల శివతో
ఈ సినిమా పూర్తయిన వెంటనే ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో ఒక సినిమా చేయాల్సి ఉంది.. అయితే అనుకోని కారణాలతో త్రివిక్రమ్ ఎన్టీఆర్ సినిమా క్యాన్సిల్ అయింది. అదే స్థానంలో కొరటాల శివ ఎన్టీఆర్ సినిమా అధికారిక ప్రకటన వెలువడింది. ఎన్టీఆర్ కొరటాల శివతో సినిమా చేస్తూ ఉండడంతో త్రివిక్రమ్ మహేష్ బాబుతో సినిమా అనౌన్స్ చేశాడు. ఇక రాజమౌళితో సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే ఎన్టీఆర్ కొరటాల శివతో సినిమా మొదలు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

గ్యాప్ వాడుకుంటున్న కొరటాల
ప్రస్తుతం కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆచార్య అనే సినిమా చేస్తున్నారు.. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ కూడా ప్రస్తుతానికి జరగడం లేదు. ఈ సినిమా షూటింగ్ అంతా పూర్తికాగా కేవలం పది పదిహేను రోజుల ప్యాచ్ వర్క్ మాత్రమే మిగిలి ఉంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ప్రస్తుతం వచ్చిన గ్యాప్ ను కొరటాల శివ ఎన్టీఆర్ కోసం స్క్రిప్ట్ సిద్ధం చేసే పని కోసం వినియోగిస్తున్నట్లు సమాచారం.. తన డైరెక్షన్ టీంతో కలిసి కొరటాల శివ ఎన్టీఆర్ సినిమా స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నాడట

నెవర్ బిఫోర్ రోల్లో
అయితే తాజాగా ఎన్టీఆర్ సినిమాకి సంబంధించి ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.. ఈ సినిమాలో ఎన్టీఆర్ కోసం కొరటాల శివ ఒక పవర్ఫుల్ రోల్ సిద్ధం చేశాడని తెలుస్తోంది. ఎన్టీఆర్ మునుపెన్నడూ పోషించనటువంటి పాత్ర ఈ సినిమాలో పోషిస్తాడని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. జరుగుతున్న ప్రచారం మేరకు ఈ సినిమాలో ఎన్టీఆర్ ఒక ఉద్యమ నేత పాత్రలో నటించే అవకాశం ఉందని అంటున్నారు.. గతంలో స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాలో కూడా ఎన్టీఆర్ స్టూడెంట్ లీడర్ పాత్రను నటించాడు. కానీ ఇప్పుడు ఏకంగా ఉద్యమ నేత పాత్రను ఆయన పోషించనున్నారు అనే ప్రచారం జరుగుతోంది..

ఆ పార్టీ వాయిస్ వినిపిస్తారా
ఇక ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాడన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష హోదాలో ఉంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ సినిమాతో తెలుగుదేశం పార్టీ వాయిస్ వినిపిస్తూ అధికార పార్టీకి లేదా ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించే అవకాశాలు ఉన్నాయేమో అని ప్రచారం కూడా జరుగుతోంది.. అయితే అలాంటి ప్రయత్నాలు ఏవి ఇప్పుడు చేయకపోవచ్చని అని కొందరు చెబుతున్నారు. గతంలో ఇలా ప్రభుత్వాలకు లేదా ప్రభుత్వాధినేతలకు వ్యతిరేకంగా చేసిన సినిమాలు పెద్దగా మంచి ఫలితాలు అందుకున్న దాఖలాలు లేవనీ అంటున్నారు.

సోషల్ మెసేజ్ పక్కా
అయితే కొరటాల శివ సినిమా అంటే కచ్చితంగా ఏదో ఒక సోషల్ మెసేజ్ తో కూడే ఉంటుంది.. బహుశా ఈ సినిమాతో కూడా ఎన్టీఆర్ ను ఒక ఉద్యమ నేతగా చూపించి ఏదైనా మెసేజ్ పంపించే అవకాశాలు మాత్రం మెండుగా ఉన్నాయని అంటున్నారు. ఇక ఎన్టీఆర్ సినిమాలో హీరోయిన్ అంటూ చాలా మంది పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి.. అయితే అధికారిక ప్రకటన తప్ప మరే ఇతర వివరాలు యూనిట్ వెల్లడించలేదు. ఈ సినిమాని కొరటాల స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్ అలాగే ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











