కొరటాల శివ కి విచిత్రమైన డౌట్స్

By Srikanya

హైదరాబాద్: మిర్చి హిట్ తో స్టార్ డైరక్టర్ గా ఓవర్ నైట్ లో ఎదిగిన కొరటాల శివ తన నెక్ట్స్ ప్రాజెక్టు లేటయ్యేటట్లు ఉండటంతో ఖాళీగా కూర్చోవటమెందుకు అని ట్వీట్స్ రాసుకుంటున్నాడు. తాజాగా ఆయన గవర్నర్ నరసింహన్ ... తీర్ధయాత్రల ఖర్చులను ప్రశ్నిస్తున్నాడు. ఆయన ట్వీట్ చేస్తూ..." గవర్నర్ నరసింహన్ తన కుటుంబంతో కలిసి దేవాలయాలు దర్శిస్తున్నారు కదా... అది ఆయన సొంత ఖర్చుతోనా లేక ప్రభుత్వ ఖర్చుతోనా ?" అని ప్రశ్నిస్తున్నారు. గవర్నర్ దీనికి సమాధానమిస్తారో లేదో కానీ కొరటాల శివ ట్వీట్స్ చూసి మరీ ఇలాంటి సందేహాలు వస్తున్నాయేంటి అని సినీ వర్గాలు నవ్వుకుంటున్నారు.

కొరటాల శివ తన తదుపరి చిత్రాన్ని మహేష్ తో చేయనున్నారు. అయితే ప్రస్తుతం మహేష్ 'ఆగడు' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈలోగా మరో సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేసుకొంటున్నారు. మహేష్‌బాబు - కొరటాల శివ కలయికలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటుందని ఎప్పటి నుంచో అనుకొంటున్నారు. ఇప్పుడు ఈ సినిమా బండి ముందుకు కదిలింది. కథ సిద్ధమైందని.. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్తామని చిత్రబృందం ప్రకటించింది.

మహేష్ బాబు మాట్లాడుతూ....కొరటాల చెప్పిన కథ ఎంతో ఎక్సయిటింగ్ గా ఉంది. మా కాంబినేషన్ లో ఇది మంచి కమర్సియల్ ఫిలిం అవుతుంది. మైత్రి మూవీ మేకర్స్ బేనర్ లో ఈ సినిమా రూపొందుతోంది అన్నారు.

Koratala Shiva tweet on Governor Narasimhan

దర్శకుడు మాట్లాడుతూ ''నా రెండో చిత్రమే మహేష్‌బాబుతో చేయబోతుండడం ఆనందంగా ఉంది. క్లాస్‌, మాస్‌ కలిపిన కథలో మహేష్‌ పాత్ర ఆకట్టుకొంటుంది. ఈ కథలో అన్ని రకాల వాణిజ్య హంగులూ ఉన్నాయి. మంచి అభిరుచి ఉన్న నిర్మాతలు దొరికారు.ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించడానికి ప్లాన్ చేశారు. యువతరం, కుటుంబం తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుంది. మహేష్ బాబు అభిమానులు మెచ్చే చిత్రం అవుతుంది ''అన్నారు.

నిర్మాలు మాట్లాడుతూ... మా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించే తొలి చిత్రమే సూపర్ స్టార్ మహేష్ బాబు గారితో చెయ్యడం మా అదృష్టంగా భావిస్తున్నాము. మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఎంతో భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నాము. రెగ్యులర్ షూటింగ్ జూలై నుండి ఉంటుంది అన్నారు.

మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శ్త్తకత్వంలో ఓ భారీ చిత్రం రూపొందనుంది. ఈ సినిమా జూలై నెలలో ప్రారంభం కానుంది. ఓవర్సీస్ లో అత్తారింటికి దారేది వంటి భారీ సినిమాలు పంపిణీ చేసి ఎంతో మంచి పేరు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంగీతం:దేవిశ్రీప్రసాద్,ఫోటోగ్రఫిః మది, ఫైట్స్: అరసు, ఎగ్జిక్యూటివ్ ప్రసాద్:అశోక్, నిర్మాతలుః ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్, సివియమ్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X