NTR30: ఎన్టీఆర్ కోసం కొరటాల యూటర్న్.. నందమూరి ఫ్యాన్స్‌కు ట్రీట్ గ్యారెంటీ

యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్స్, సింగింగ్ ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ.. తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగిపోయాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. ఎన్నో భారీ విజయాలతో కెరీర్ ఆరంభంలోనే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్న అతడు.. భారీ స్థాయిలో అభిమానులను కూడా అందుకున్నాడు. మధ్యలో వరుసగా పరాజయాలు ఎదురైనా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ముందుకెళ్లాడు. ఈ క్రమంలోనే 'టెంపర్' నుంచి వరుసగా 'నాన్నకు ప్రేమతో', 'జనతా గ్యారేజ్', 'జై లవ కుశ', 'అరవింద సమేత.. వీరరాఘవ' వంటి సూపర్ డూపర్ హిట్లను ఖాతాలో వేసుకుని మళ్లీ ఫుల్ ఫామ్‌తో కనిపిస్తున్నాడు.

వరుస పెట్టి హిట్లు మీద హిట్లు కొడుతూ ఫుల్ స్వింగ్‌లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్.. కొద్ది రోజుల క్రితమే RRR (రౌద్రం రణం రుధిరం) అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాలతో పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ అయిన ఈ మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అంతేకాదు, భారీ కలెక్షన్లను రాబట్టి ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను నమోదు చేసుకుంది. ఈ ఉత్సాహంతోనే ఈ నందమూరి హీరో తన తదుపరి చిత్రాన్ని బడా డైరెక్టర్ కొరటాల శివతో చేయబోతున్నాడు. అయితే, ఈ సినిమా అనుకున్న సమయానికి ప్రారంభం కావడం లేదు. దీంతో ఈ సినిమాపై అనుమానాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇటీవలే దీనికి సంబంధించిన గ్లిమ్స్ వీడియోను రిలీజ్ చేశారు.

 Koratala Shiva Wrote Mass Story for Jr NTR Movie

'జనతా గ్యారేజ్' వంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమా నుంచి ఎన్నో రకాల ఆసక్తికరమైన విషయాలు కూడా తెరపైకి వస్తున్నాయి. అదే సమయంలో ఈ సినిమా జూలై నుంచి రెగ్యూలర్ షూటింగ్ జరుపుకోబోతుందని కూడా డైరెక్టర్ కొరటాల శివ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. అప్పటి నుంచి దీనికోసం నందమూరి అభిమానులు వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ ప్రాజెక్టు గురించి ఎవరూ ఊహించని న్యూస్ ఒకటి ఫిలిం నగర్ ఏరియాలో చక్కర్లు కొడుతోంది.

తాజా సమాచారం ప్రకారం.. జూనియర్ ఎన్టీఆర్‌తో తెరకెక్కించబోయే ఈ సినిమా కోసం కొరటాల శివ స్టోరీ లైన్‌లో మార్పులు చేసుకున్నాడట. నిన్నమొన్నటి వరకూ సందేశాత్మక కథలతో వచ్చిన అతడు.. ఇందులో మాత్రం అలాంటి ప్రయత్నాలు ఏమీ చేయడం లేదని తెలిసింది. అంతేకాదు, ఈ సినిమాను గతంలో ఎన్నడూ లేని విధంగా పక్కా మాస్ మసాలా సినిమాగా రూపొందించబోతున్నాడట. ఎన్టీఆర్‌ను కూడా ఇందులో ఎంతో పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో చూపించబోతున్నాడనే టాక్ వినిపిస్తోంది. ఇలా కొన్ని మార్పులు చేయడం వల్లే ఈ సినిమా అంతకంతకూ ఆలస్యం అవుతూ వస్తుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోయే ఈ సినిమా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుంది. పల్లెటూరి నుంచి వచ్చిన యువకుడు అందరి దృష్టినీ ఆకర్షించే శక్తిలా ఎలా ఎదిగాడు అన్న కథతో ఇది తెరకెక్కబోతుందట. ఇక, ఈ సినిమాను నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి కోలీవుడ్ యంగ్ సెన్సేషన్ అనిరుథ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X