మొదట రామ్ చరణ్.. ఆ వెంటనే ప్రభాస్.. కొరటాల పవర్‌ఫుల్ ప్లాన్!
మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' సినిమా చేసి చిరంజీవి కోసం చాలా సమయం వేచిచూసిన డైరెక్టర్ కొరటాల శివ ఇక వేగం పెంచేయబోతున్నారట. ఈ మేరకు చిరంజీవి సినిమా చేస్తూనే తన తదుపరి ప్రాజెక్టులపై కసరత్తులు చేస్తున్నట్లు టాక్. ఇప్పటికే రామ్ చరణ్‌కి ఓ కథ వినిపించి ఓకే చేయించుకున్నారని తెలుస్తుండగా, తాజాగా ప్రభాస్ పేరు బయటకు రావడం మరింత ఆసక్తికరంగా మారింది.
చిరంజీవితో చేస్తున్న సినిమాను శరవేగంగా ఫినిష్ చేస్తున్న కొరటాల శివ, ఈ మూవీ పూర్తయిన వెంటనే రామ్ చరణ్‌తో మూవీ కంప్లీట్ చేసేస్తారట. ఇక ఆ వెంటనే రెబల్ స్టార్ ప్రభాస్‌తో మరో సినిమాను సెట్స్ మీదకు తెస్తారట. ఈ మేరకు ఆయన ప్రభాస్ అంగీకారం కూడా తీసుకున్నట్లు ఫిలిం నగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

ప్రభాస్ హీరోగా కొరటాల శివ తెరకెక్కించనున్న సినిమాకు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మాణ బాధ్యతలు తీసుకోనుందని సమాచారం. ప్రస్తుతం ప్రభాస్ తన 20వ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తికాగానే తన 21వ సినిమాను నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేయనున్నారు. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తికాగానే కొరటాల శివ ప్రాజెక్టులో భాగం కానున్నారట ప్రభాస్.
గతంలో కొరటాల - ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన 'మిర్చి' భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. కొరటాలకు దర్శకుడిగా ఇదే తొలి సినిమా కూడా. ఆ తర్వాత తెలుగు ప్రేక్షక లోకానికి తన మార్క్ చూపించిన కొరటాల.. మళ్లీ ఇంత కాలానికి ప్రభాస్‌తో సినిమా తీయబోతున్నాడనే విషయం జనాల్లో ఆసక్తి కలుగజేస్తోంది.


Click it and Unblock the Notifications











