NTR30 కోసం స్టార్ నటుడు.. షూట్ ఎప్పటి నుంచి అంటే?
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ అనే సినిమా చేస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆయన రామ్ చరణ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే ఆయన కొరటాల శివతో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా గురించి తాజాగా ఒక ప్రచారం వెలుగులోకి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే

బిజీబిజీ
దర్శకుడు కొరటాల శివ ఆచార్య కోసం దాదాపు మూడేళ్లుగా పనిచేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి సహా రామ్ చరణ్ నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ కోవిడ్ -19 మహమ్మారితో సహా అనేక సమస్యలు ఎదుర్కొంటుంది. ఇక కొన్ని రోజుల షూట్ మాత్రమే మిగిలి ఉండగా ఈ సినిమా పూర్తయిన వెంటనే ఆయన ఎన్టీఆర్ ప్రాజెక్ట్ చేయనున్నారు.

షూట్ ఎప్పుడంటే
ఇక ఈ సినిమా ఎప్పుడు పట్టాలపైకి వెళ్లనుందా అని అంతా ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. అందుతున్న సమాచారం మేరకు వచ్చే నెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది అని అంటున్నారు. ఇప్పటికే కొరటాల బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ చేసుకుని ఉన్నారని అంటున్నారు. అంతే కాక ప్రస్తుతం క్యాస్టింగ్ లో బిజీబిజీగా ఉన్నారని అంటున్నారు.

స్టార్ నటుడు లైన్ లోకి
జరుగుతున్న ప్రచారం మేరకు ఈ సినిమాలో హీరోయిన్ గా కైరా అద్వానీ ఎంపికైనట్టు ప్రచారం జరుగుతోంది. అలాగే ఒక కీలక పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ నటుడిని ఫైనల్ చేశారని అంటున్నారు. ఎన్‌టిఆర్ 30లో ఒక ముఖ్యమైన పాత్ర కోసం బాలీవుడ్ నటుడు బోమన్ ఇరానీని సంప్రదించారని అంటున్నారు. అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి, మరియు నా పేరు సూర్య వంటి చిత్రాలలో బోమన్ ఇరానీ కనిపించారు.

ఆచార్యతో అలెర్ట్
ఇక ఆచార్య దెబ్బతో కొరటాల శివ ఎన్టీఆర్ సినిమా కోసం ఒక ఖచ్చితమైన ప్లాన్ సిద్దం చేశారని అంటున్నారు. ఈ సినిమాని కొరటాల శివ స్నేహితుడు సుధాకర్ మిక్కిలినేని నిర్మించనున్నారు. కాబట్టి, చిత్రనిర్మాతకు ఎక్కువ సమయం తీసుకోకుండా అన్ని విషయాలు ప్లాన్ చేయడానికి కొరటాలకు పూర్తి స్వేచ్ఛ ఉంది. అందుకే కొరటాల రెగ్యులర్ షూట్ ప్రారంభమైన కొన్ని నెలల్లో ఎన్టీఆర్ ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడని అంటున్నారు.

హీరోయిన్ ఎవరో?
సినిమా ప్రకటన మినహా ఈ యూనిట్ నుంచి మరో ప్రకటన ఏమీ వెలువడక పోవడంతో ఈ సినిమాలో నటించే వారి గురించి రకరకాల ప్రచారాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో ఒక బాలీవుడ్ హీరోయిన్ ని తీసుకోవాలని భావిస్తున్నట్లుగా చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే దిశా పటాని, కైరా అద్వానే, జాన్వీ కపూర్ లాంటి వాళ్ళ పేర్లు కూడా తెరమీదకు వచ్చాయి. మరి ఎవరిని ఫైనల్ చేస్తారో వేచి చూడాలి మరి.


Click it and Unblock the Notifications











