స్టార్ హీరోల రేంజ్‌లో కొరటాల శివ.. చిరు 152కి డిమాండ్ చేస్తున్నది ఏంటంటే!

Recommended Video

#Chiranjeevi152: Did Ramcharan Gave Rs 2 Cr Cash & Shares to Koratala Siva? | Filmibeat Telugu

రచయితగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొరటాల శివ టాలీవుడ్ టాప్ దర్శకులలో ఒకరిగా మారిపోయారు. కొరటాల శివ నాలుగు వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో అతడి రేంజే మారిపోయింది. తనదైన శైలిలో సందేశాన్ని, కమర్షియల్ ఎలిమెంట్స్ ని మిక్స్ చేస్తూ మ్యాజిక్ చేస్తున్నాడు. ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలని డైరెక్ట్ చేసిన కొరటాల శివ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి.

 త్వరలో ప్రారంభం

త్వరలో ప్రారంభం

వాస్తవానికి కొరటాల శివ, చిరంజీవి చిత్రం ఇప్పటికే మొదలై ఉండాలి.కానీ సైరా చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఇంకా ఉండడంతో ఆలస్యం అవుతోంది. మెగాస్టార్ కు సరిపడే ఓ సందేశాత్మక కథతో కొరటాల సిద్ధంగా ఉన్నాడు. కొరటాల శివ తన పరిధిలో అన్ని ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు చేస్తున్నాడు. వరుసగా మూడవ సారి మెగా పవర్ స్టార్ రాంచరణ్ చిరంజీవి చిత్రాన్ని నిర్మించనుండడం విశేషం. సైరా పూర్తయితే రాంచరణ్ కూడా ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది.

 స్టార్ హీరోల రేంజ్‌లో

స్టార్ హీరోల రేంజ్‌లో

నాలుగు వరుస విజయాల తర్వాత కొరటాల శివ స్థాయి అమాంతం పెరిగింది. కొరటాల శివ ప్రస్తుతం 10నుంచి 15 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకోబోతునట్లు వార్తలు వస్తున్నాయి. కానీ కొరటాల శివకు రాంచరణ్ కు మధ్య ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది. అడ్వాన్స్ గా రాంచరణ్ కొరటాలకు 2 కోట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. మిగిలిన మొత్తానికిగాను తనకు డిస్ట్రిబ్యూషన్ హక్కులు ఇమ్మని కొరటాల అడిగాడట. దీనితో ఉత్తరాంధ్ర ప్రాంతంలో షేర్ లో కొరటాల శివ వాటా పొందనునట్లు తెలుస్తోంది.

రైతు పాత్రలో

రైతు పాత్రలో

ఈ చిత్రంలో చిరంజీవి రైతు పాత్రలో నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. బలమైన సందేశాత్మక అంశాలతో కొరటాల శివ ఈ కథని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. సైరా షూటింగ్ ఓ కొలిక్కి వచ్చాక ఈ చిరంజీవి 152 ప్రారంభోత్సవం జరగనుంది. ఇప్పటికే కొరటాల శివ ఈ చిత్రంలో చిరుకి జోడిగా నయనతార, అనుష్క, తమన్నా లాంటి హీరోయిన్ల పేర్లు పరిశీలిస్తున్నారు.

దసరాకే

దసరాకే

సైరా నరసింహారెడ్డి చిత్రం ఈ వేసవికే విడుదలవుతుందని భావించారు. కానీ తాజాగా సైరా చిత్రం దసరా బరిలో నిలిస్తున్నట్లు తెలుస్తోంది. కొరటాల శివ చిత్రం తర్వాత చిరు నటించబోయే చిత్రం కూడా ఖరారైంది. వినయ విధేయ రామ ప్రీరిలీజ్ ఈవెంట్ సందర్భంగా తాను త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శత్వంలో నటించాబోతున్నానని చిరంజీవి ప్రకటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X