క్రేజీ కాంబినేషన్.. కొరటాల శివ హీరో అతడే, నిర్మాత కూడా!

రచయితగా సూపర్ హిట్ చిత్రాలకు పనిచేసిన కొరటాల శివ మిర్చి చిత్రంతో దర్శకుడిగా మారి ఘనవిజయం అందుకున్నాడు. ఆ తరువాత కొరటాల శివ తెరకెక్కించిన శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను చిత్రాలు తిరుగు లేని విజయాలు సాధించాయి. దీనితో కొరటాల శివ టాలీవుడ్ లో తిరుగులేని దర్శకుడిగా మారిపోయారు. కొరటాల శివతో సినిమా చేయడానికి స్టార్ హీరోలు సైతం ఆసక్తిగా ఉన్నాయి. భరత్ అనే నేను చిత్రం విడుదలైనప్పటి నుంచి కొరటాల తదుపరి చిత్రాలపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజగా సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది.

Recommended Video

Who is The Next Hero in Koratal Siva New Movie???
కొరటాల ప్రత్యేకత అదే

కొరటాల ప్రత్యేకత అదే

మిర్చి చిత్రంతో దర్శకుడిగా మారిన కొరటాల తొలి ప్రయత్నంలోనే అద్భుత విజయాన్ని అందుకున్నారు. కమర్షియల్ అంశాలతో సినిమాలు చేస్తూ ప్రేక్షకులు మెచ్చేలా సందేశాన్ని కూడా జోడించి తన ప్రత్యేకతని చాటుకున్నారు. ఈ అంశాలనే కోరాలని, రెగ్యులర్ కమర్షియల్ దర్శకులని వేరు చేసి చూపిస్తుంది.

 భరత్ వరకు అన్నీ

భరత్ వరకు అన్నీ

మిర్చి చిత్రం నుంచి ఇటీవల వచ్చిన భరత్ అనే నేను చిత్రం వరకు కొరటాల అన్ని చిత్రాల్ని బ్లాక్ బస్టర్ విజయాలుగా తీర్చి దిద్దారు. ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో పని చేసిన కొరటాల తదుపరి చిత్రం విషయంలో ఆసక్తికరమైన వార్తలు వస్తున్నాయి.

అల్లు అర్జున్, చిరంజీవి

అల్లు అర్జున్, చిరంజీవి

నా పేరు సూర్య చిత్రం తరువాత అల్లు అర్జున్ కూడా తదుపరి చిత్రాన్ని ప్రకటించలేదు. కొరటాల, బన్నీ కాంబినేషన్ లో సినిమా ప్రారంభం కాబోతోందంటూ సోషల్ మీడియాలో ఊహాగానాలు వినిపించాయి. అలాగే మెగాస్టార్ చిరంజీవి పేరు కూడా వినిపించింది. ఈ వార్తలు ఇలా ప్రచారంలో ఉండగానే మరో హీరో పేరు వినిపిస్తోంది.

నానితో సినిమా

నానితో సినిమా

కొరటాల ఇటీవల నానిని కలసి కథ వినిపించడానికి, కొరటాల దర్శకత్వం పట్ల నాని చాలా ఆసక్తిగా ఉన్నాడని ప్రచారం జరుగుతోంది. వీరిద్దరి కాంబినేషన్ గురించి సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది. కొరటాల సన్నిహితుడు, డిస్ట్రిబ్యూటర్ అయిన సుధాకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తారట. ఏది ఏమైనా ఈ వార్తలపై అధికారి సమాచారం ఇంకా వెలువడలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X