NTR 30 కోసం కొరటాల మాస్టర్ స్కెచ్.. ఆ భామనే ఫైనల్.. స్పెషల్ అసెట్ అవుతుందని?
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో RRR అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో ఆయన రామ్ చరణ్ తో కలిసి నటించారు. ఈ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉండగా రిలీజ్ అయినా వెంటనే ఆయన కొరటాల శివతో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా గురించి ఇప్పటికే రకరకాల ప్రచారాలు జరుగుతూ ఉండగా తాజాగా ఈ సినిమా హీరోయిన్ కి సంబంధించి ఒక వార్త వెలుగులోకి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..

అరవింద సమేతతో
2018లో అరవింద సమేత వీర రాఘవ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎన్టీఆర్ ఆ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఫ్యాక్షన్ రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. అయితే ఈ సినిమా పూర్తయిన వెంటనే రాజమౌళి RRR కోసం ఎన్టీఆర్ డేట్స్ అన్నీ బ్లాక్ చేశారు

ఏమైందో తెలియదు కానీ
రాజమౌళి సినిమా పూర్తయి రిలీజ్ కి సిద్ధంగా ఉండడంతో ఎన్టీఆర్ ప్రస్తుతం ఆ సినిమా ప్రమోషన్స్ లో రామ్ చరణ్ తో కలిసి పాల్గొంటున్నారు. అయితే రాజమౌళి RRR తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ తోనే సినిమా చేయాల్సి ఉంది. నిజానికి త్రివిక్రమ్ అల వైకుంఠపురంలో సినిమా పూర్తి చేసిన వెంటనే ఎన్టీఆర్ తో సినిమా ప్రకటించారు. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ అనూహ్యంగా ఆ ప్రాజెక్ట్ రద్దయింది.

కొరటాల శివ ఎన్టీఆర్ ప్రాజెక్టు
ఆ స్థానంలో కొరటాల శివ ఎన్టీఆర్ ప్రాజెక్టు అనౌన్స్ చేశారు. త్రివిక్రమ్ మహేష్ బాబుతో సినిమా చేయనుండగా ఎన్టీఆర్ కొరటాల శివతో సినిమా చేస్తున్నారన్నమాట. అయితే ఈ సినిమా అధికారిక ప్రకటన మినహా ఈ సినిమా నుంచి మరెలాంటి ప్రకటన వెలువడక పోవడంతో ఈ సినిమాలో నటించే వారి గురించి రకరకాల ప్రచారాలు జరుగుతూ వస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో ఒక బాలీవుడ్ హీరోయిన్ ని తీసుకోవాలని భావిస్తున్నట్లుగా చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది.

ప్రాధమిక దశలో చర్చలు
అందులో భాగంగానే దిశా పటాని, జాన్వీ కపూర్ లాంటి వాళ్ళ పేర్లు కూడా తెరమీదకు రాగా కియారాను ఫైనల్ చేశారని ఆ మధ్య ప్రచారం అయింది. బాలీవుడ్ నటి అలియా భట్ ఈ ప్రాజెక్ట్‌లో కథానాయికగా దాదాపుగా ధృవీకరించబడినట్లు విశ్వసనీయంగా తెలిసింది. చర్చలు ప్రస్తుతానికి ప్రాధమిక దశలో ఉన్నాయి , అతి త్వరలో అగ్రిమెంట్ల మీద సంతకం చేయవచ్చని అంటున్నారు.

#NTR30కి అలియా
అలియా RRRలో రామ్ చరణ్ సరసన జతకట్టింది. అలియా భట్ హిందీ మార్కెట్‌లో సూపర్ స్టార్‌డమ్‌ని కలిగి ఉంది. #NTR30కి ఖచ్చితంగా ఆమె మార్కెట్ వాల్యూ స్పెషల్ అసెట్ అవుతుందని అంటున్నారు. ఇక ఆర్‌ఆర్‌ఆర్ ప్రమోషన్స్‌లో ఎన్టీఆర్ మరియు అలియా మంచి స్నేహితులుగా కనిపిస్తున్న క్రమంలో వీరి కెమిస్ట్రీ కూడా బాగుంటుందని అంటున్నారు.


Click it and Unblock the Notifications











