ఎన్టీఆర్ 30 కోసం హీరోయిన్ ఫిక్స్.. ఆ ప్లాన్ తో రంగంలోకి దింపిన కొరటాల!
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆయన రామ్ చరణ్ తో కలిసి నటిస్తున్నారు.. ఈ సినిమా పూర్తయిన వెంటనే ఆయన కొరటాల శివతో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా గురించి ఇప్పటికే రకరకాల ప్రచారాలు జరుగుతూ ఉండగా తాజాగా ఈ సినిమా హీరోయిన్ కి సంబంధించి ఒక వార్త వెలుగులోకి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే

చివరిగా అరవింద సమేత
2018లో అరవింద సమేత వీర రాఘవ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎన్టీఆర్ ఆ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు.. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది.. ఫ్యాక్షన్ రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులందరికీ బాగా నచ్చింది. ఈ సినిమా పూర్తయిన వెంటనే రాజమౌళి ఎన్టీఆర్ బల్క్ డేట్స్ బ్లాక్ చేశారు. ఇక త్వరలో రాజమౌళి సినిమా పూర్తయ్యే అవకాశాలు ఉండడంతో ఎన్టీఆర్ తన తదుపరి సినిమా మీద కూడా దృష్టి పెట్టారు.

త్రివిక్రమ్ బదులు కొరటాల
నిజానికి త్రివిక్రమ్ అల వైకుంఠపురంలో సినిమా పూర్తి చేసిన వెంటనే ఎన్టీఆర్ తో సినిమా ప్రకటించారు. రాజమౌళి తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ తోనే సినిమా చేయాల్సి ఉంది. కారణాలు ఏవైనా కానీ అనూహ్యంగా ఆ ప్రాజెక్ట్ రద్దయింది. ఆస్థానంలోని కొరటాల శివ ఎన్టీఆర్ ప్రాజెక్టు అనౌన్స్ చేశారు. త్రివిక్రమ్ మహేష్ బాబుతో సినిమా చేయనుండగా ఎన్టీఆర్ కొరటాల శివతో సినిమా చేయబోతున్నారు.

రోజుకో ప్రచారం
ఇక ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన మినహా ఏమీ వెలువడక పోవడంతో ఈ సినిమాలో నటించే వారి గురించి రకరకాల ప్రచారాలు వెలుగులోకి వస్తున్నాయి.. ఇప్పటికే ఈ సినిమాలో ఒక బాలీవుడ్ హీరోయిన్ ని తీసుకోవాలని భావిస్తున్నట్లుగా చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే దిశా పటాని, జాన్వీ కపూర్ లాంటి వాళ్ళ పేర్లు కూడా తెరమీదకు వచ్చాయి. ఆ విషయం మీద సరైన క్లారిటీ కూడా రాకుండానే ఇప్పుడు మరో భామ పేరు తెరమీదకు వచ్చింది.

కియారా అద్వానీ
ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కనున్న ఈ సినిమా కోసం భరత్ అనే నేను సినిమాలో నటించిన కియారా అద్వానీని సంప్రదించినట్లు తెలుస్తోంది. ఒక సారి కథ విన్న కియారా అద్వానీ తాను సినిమా చేస్తానని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాక ఆమె ఇటీవల అగ్రిమెంట్ లో సంతకాలు కూడా చేసినట్లు చెబుతున్నారు.. నిజానికి గతంలో ఈ భామ కొరటాల శివ భరత్ అనే నేను సినిమాలో కూడా హీరోయిన్ గా నటించింది..
Recommended Video

కరోనా హాలిడేస్
ఇక కరోనా వైరస్ వలన షూటింగ్స్ అన్నీ నిలిచిపోవడంతో ఎన్టీఆర్ స్క్రిప్ట్ మీద కొరటాల శివ మరింత ఫోకస్ పెట్టినట్లు చెబుతున్నారు. ఆర్ఆర్ఆర్ దెబ్బకి ఎన్టీఆర్ కి ప్యాన్ ఇండియా ఇమేజ్ వస్తుంది. ఆ ఇమేజ్ ని వాడుకుంటూ తమ సినిమాని కూడా ప్యాన్ ఇండియా లెవల్ లోనే రిలీజ్ చేయాలని చూస్తున్నట్టు చెబుతున్నారు. అందుకే బాలీవుడ్ లో కూడా క్రేజ్ ఉన్న భామను తీసుకున్నారని అంటున్నారు. నిజానికి ఆయన ఇప్పుడు చిరంజీవితో ఆచార్య అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా కరోనా కారణంగా ఆగిపోయింది. అయితే ఈ సమయాన్ని వృధా చేయకుండా ఆయన ఎన్టీఆర్ సినిమా స్క్రిప్టుకు తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్నారని అంటున్నారు.


Click it and Unblock the Notifications











