twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కొరటాల శివ విషయంలో అది నిజం కాదట.. అంతా ఒట్టిదే అంటున్నారే!

    |

    కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఆచార్య సినిమా డిజాస్టర్ ఫలితాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న సినిమా కావడంతో సాధారణంగా ఈ సినిమా మీద అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమా విఫలమైన నేపథ్యంలో భారీ డిజాస్టర్ గా నిలిచింది.

    ఈ నేపద్యంలో కొరటాల శివ మీద డిస్ట్రిబ్యూటర్లు ప్రెజర్ పెట్టారని దీంతో ఆయన తనకు జూబ్లీహిల్స్ ఏరియాలో ఉన్న ఖరీదైన ఫ్లాట్ అమేసి ఆ డబ్బులు ఇస్తున్నారు అనే ప్రచారం జరుగుతున్న నేపద్యంలో తాజాగా ఆ విషయం మీద కొరటాల శివ సన్నిహితులు స్పందించినట్లు తెలుస్తోంది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

    వాటాదారులుగా

    వాటాదారులుగా

    కొరటాల శివ భరత్ అనే నేను సినిమా చేసిన తర్వాత కొంత గ్యాప్ తీసుకుని ఆచార్య అనే సినిమా చేయడానికి సిద్ధమయ్యారు. తొలత మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబు కాంబినేషన్ లో ఈ సినిమా చేయాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ రామ్ చరణ్ తేజ చేస్తే బాగుంటుందని చిరంజీవి ఫ్యామిలీ నుంచి ప్రపోజల్ రావడంతో పాటు రామ్ చరణ్ చేస్తే సినిమాలో తాము కూడా వాటాదారులుగా ఉంటామని ఆఫర్ ఇచ్చిన నేపథ్యంలో అదేవిధంగా ప్లాన్ చేశారు.

    కొరటాల శివ కొనుగోలు

    కొరటాల శివ కొనుగోలు


    అయితే కథలో అనేక మార్పులు చేర్పులు చేసి సినిమాలో రామ్ చరణ్ పాత్ర నిడివి కూడా భారీగా పెంచారు. ఎలా అయితేనేమి ఎట్టకేలకు సినిమాని పూర్తి చేసి ఏప్రిల్ 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. కానీ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది. నిజానికి సినిమా విడుదల కావడానికి కొన్నాళ్ళ ముందు సినిమాను నాలుగు కోట్ల రూపాయల లాభానికి సినీ నిర్మాత నిరంజన్ రెడ్డి నుంచి కొరటాల శివ కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు.

    ఆఫీస్ లోనే తిష్ట

    ఆఫీస్ లోనే తిష్ట


    దీంతో డిస్ట్రిబ్యూషన్ కూడా తానే చేసుకున్నారని సినిమా భారీగా నష్టపోయిన నేపథ్యంలో కొన్ని ఏరియాల డిస్ట్రిబ్యూటర్లు ప్రాణం మీదకు వచ్చిన సమయంలో కొంత డబ్బు సర్దుబాటు చేసినట్లు తెలుస్తోంది. ఆ డబ్బు సర్దుబాటు చేయడంతో మిగతా ఏరియాల వారు కూడా వచ్చి తమ సంగతి ఏంటో చూడాలంటూ కొరటాల శివ ఆఫీస్ లోనే తిష్ట వేసినట్లు కొన్ని రోజుల క్రితం ప్రచారం జరిగింది.

    డిస్ట్రిబ్యూటర్లు వెనక్కి

    డిస్ట్రిబ్యూటర్లు వెనక్కి


    ఈ నేపథ్యంలో అదే సమయంలో కొరటాల శివ తన ఆస్తి అమ్మి డిస్ట్రిబ్యూటర్లకు సర్దుబాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు అనే ప్రచారం జరిగింది. అయితే అది నిజం కాదని తాజాగా కొరటాల శివ సన్నిహితులు వెల్లడించారు. కొరటాల శివ ఇబ్బందులు పడిన మాట వాస్తవమే కానీ మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ, నిర్మాత నిరంజన్ రెడ్డి కల్పించుకోవడంతో డిస్ట్రిబ్యూటర్లు కాస్త వెనక్కి తగ్గారని వాళ్లకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా సర్దుబాటు చేయడానికి ముందుకు వచ్చారని వెల్లడించినట్లు సమాచారం.

    ఆలోచించలేదని

    ఆలోచించలేదని

    ప్రస్తుతం కొరటాల శివకు ఉన్న టెన్షన్స్ అన్ని ఫ్రీ అయ్యాయని ఆయన ఎన్టీఆర్ తో చేయబోతున్న సినిమా మీద దృష్టి పెట్టారని తెలుస్తోంది. ఈ ఫ్లాట్ అమ్మకం వార్తా అసలు నిజం కాదని దీని గురించి అసలు కొరటాల శివ ఆలోచించలేదని ఆయన సన్నిహితులు వెల్లడించినట్లు తెలుస్తోంది.

    English summary
    Koratala shiva is being in news from few days. but flat selling news is false says his close aides.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X