వరసెట్టేసాడు:కొరటాల శివ నెక్ట్స్ చిత్రం ఖరారు

By Srikanya

హైదరాబాద్: ప్రస్తుతం మహేష్ తో చిత్రం చేస్తున్న కొరటాల శివ తన తదుపరి చిత్రం ఖరారు చేసుకున్నట్లు తాజా సమాచారం. ఫిల్మ్ నగర్ లో అందుతున్న సమాచారాన్ని బట్టి... కొరటాల శివ రీసెంట్ గా ... అల్లు అర్జున్ కు స్క్రిప్టు వినిపించారని, అది ఆయన వెంటనే ఓకే చేసినట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ తో చిత్రం పూర్తైన వెంటనే కొరటాల శివ చిత్రం చేస్తానని మాట ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు. మిర్చి లాంటి యాక్షన్, సెంటిమెంట్ కలిపిన మాస్ మసాలా కథ అని చెప్పుకుంటున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ప్రస్తుతం మహేష్ తో చేస్తున్న చిత్రం వివరాలకి వస్తే...

మహేష్ బాబు, శృతి హాసన్ జంటగా మిర్చి ఫేం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రాన్ని వేసవిలో మే 1న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఈ సంవత్సరం మహేష్ కు చేదు అనుభవమే మిగిలింది. చేసిన రెండు చిత్రాలు ''1'' నేనొక్కడినే, ''ఆగడు '' కూడా ఫ్లాప్ జాబితాలో పడిపోవడంతో కొరటాల తో చేస్తున్న సినిమా హిట్ అయి అభిమానులను అలరిస్తుందని ఆశిస్తున్నాడు మహేష్.

Koratala Siva for Bunny’s next flick?

ప్రిన్స్ మహేష్ అభిమానులు కూడా భారీ హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆగడు నిరాశని మిగల్చడంతో కొరటాల శివ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మహేష్ సరసన అందాల భామ శృతి హసన్ నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీస్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

అలాగే... ఈ చిత్రంలో ఓ సీన్‌ కోసం మహేష్‌ను షర్ట్‌ తీయమని కొరటాల కోరగా ప్రిన్స్‌ సున్నితంగా తిరస్కరించారని సమాచారం. ఇదే విషయంపై మేముసైతం ప్రోగ్రామ్‌లో సమంతకు ఇచ్చిన ఇంటర్వ్యూలో షర్ట్‌ తీయాల్సిన సీన్‌ వస్తే ఏం చేస్తారు.. అని ప్రశ్న వేసిన సమంతకు నో ఛాన్స్‌ అనే సమాధానం వచ్చింది. మహేష్‌ గత చిత్రం ‘1 నేనొక్కడినే' చిత్రంలోనే సిక్స్‌ ప్యాక్‌ చేశారు.

కానీ అభిమానులకు చూపించే ధైర్యం చేయలేదు మహేష్‌. ప్రిన్స్‌ వ్యక్తి పరంగా కాస్త సిగ్గు, బిడియం ఉన్న స్టార్‌. దాంతో సిక్స్‌ ప్యాక్‌ చేసినా తెరపై చూపించడానికి జంకారని ఫిలింనగర్‌ టాక్‌. మహేష్‌ సరసన శృతిహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ అందించగా మైత్రి మూవీస్‌ సంస్థ నిర్మిస్తుంది. ఈ చిత్రాన్ని కార్మికుల దినోత్సవం మే1న విడుదల చేసే ఆలోచనలో చిత్ర బృందం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X